Skip to main content

Posts

Showing posts from January, 2021

31 వ రోజు

             (Pic source:Three principles.com) ప్రతిరోజు మీ మనసులో వచ్చే ఆలోచన లను ఎప్పటికప్పుడు కాగితంపై రాసి పెట్టుకోండి. ఆలోచనలు సన్ గ్లాసెస్ లాంటివి.ఒక క్రమబద్ధంగా లేని ఆలోచనలకు అక్షరరూపం ఇస్తే మన భావాలకు ఒక రూపం వస్తుంది.అవి మంచివైనా చెడ్డవైనా ఎదైనా సరే. ఆ ఆలోచనలు మళ్లీ మళ్లీ గుర్తుకు రావు. అందుకనే జాన్ మిల్టన్ తనకు ఏ అర్థరాత్రి లోనో కవిత తన్నుకొస్తే ఆ భావాలను ఒక తాడును ముడి వేయడం ద్వారా గుర్తుపెట్టుకునే వాడట. ఉదయాన్నే లేచి ఆ ముడి విప్పుకుంటూ కవితను మళ్లీ గుర్తుకు తెచ్చుకునే వాడట.(అతను గుడ్డి వాడు.) మన  ఆలోచనలను కాగితంపై రాస్తే మనకు ఒక స్పష్టత వస్తుంది. ఆ ఆలోచనలు మళ్లీ మళ్లీ రాక పోవచ్చు. వాటిని మళ్ళీ తీరికగా  ఉన్నప్పుడు ఒక నోటు పుస్తకంలో రాయండి. వాటిల్లో మనసుకు బాగా నచ్చిన వాటిని అమలు చేయండి. వాడకపోతే ఏదైనా వ్యర్థం అయిపోతుంది.

30వ రోజు

మెదడు సక్రమంగా పనిచేయాలంటే కంటి నిండా నిద్రపోవాలి. లేకపోతే.. మానసిక సమస్యలు ఏర్పడి మీ రోజువారి పనులకు విఘాతం ఏర్పడుతుంది. నిద్రలేమి వల్ల మెదడుకు ఏర్పడే నష్టం.. ఓ ప్రమాదంలో తలకి తగిలే బలమైన గాయంతో సమానం. మెదడు లో ఆలోచనలు పాదరసం లా నిరంతరం కదులుతూ ఉంటాయి.వాటిని అదుపులో పెట్టడానికి ధ్యానం సరైన మార్గం. ధ్యానం ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మెదడు ఒక తోట లాంటిది. అందులో  ఏ విత్తనాలు వేస్తే ఆ పంట  వస్తుంది. మెదడు ఒక సిడి లాంటిది. పెన్ డ్రైవ్ లాంటిది. నీవేమి అందులో రాస్తే అదే పలుకుతుంది. బ్రెయిన్ పగటి పూట కంటే రాత్రే చురుగ్గా పనిచేస్తుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు తాజా జ్ఞాపకాలను భద్రపరచుకోవడంలో బిజీగా ఉంటుంది. అందుకే, నిద్రలేమి ప్రభావం జ్ఞాపకశక్తి మీద పడతుంది. మనిషి బతికున్నంతకాలం మెదడుకు విశ్రాంతి ఉండదు. మెదడుకు పడుకోబోయేముందు మంచి ఆలోచనలు కలిగిస్తే మెదడు వాటిని స్వీకరించి దాని కనుగుణంగా పని చేస్తుంది. మీ లక్ష్యాలను మీరు గనుక పడుకోబోయేముందు అనుకుంటూ ఉంటే కొన్ని రోజుల్లోనే మెదడు ఆ లక్ష్యాన్ని సాధించడానికి మార్గాలను కనుగొంటుంది. పరిశోధకులు ఇదే మార్గం అనుసరిస్తారు...

29 వ రోజు

         (pic courtesy:isha) ఈరోజు ఉపయోగించుకునేందుకు ఈరోజే ఆఖరిది. కాబట్టి ఈ రోజును సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్షణం నీది.  ఉపయోగించుకుంటే అది గొప్ప జీవితం. పారేసుకుంటే జీవితం వృధా జీవితం

28 వ రోజు

            (pic courtesy 123rf) విజయం ఇచ్చే ధైర్యం వందమంది గురువులతో సమానం.  వైఫల్యం అనాధ. విజయ సాధకులు ప్రత్యేకంగా ఏదీ చేయరు.  వారు పనిచేసే విధానంలో నైపుణ్యాన్ని చూస్తారు. సాహసం,శ్రమించే తత్వం, కొత్త తరహా ఆలోచనా విధానం గల వారి కోసం విజయాలు నిరీక్షిస్తూ ఉంటాయి పిచ్చుక సాహసం ఒక బుల్లి పిట్ట పిచ్చుక సముద్రపు ఒడ్డున ఉన్న చెట్టు పై రెండు గుడ్లు పెట్టింది. ఆ రెంటిని చూసుకుని మురిసిపోయేది. ఆ రెండు గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారుతాయా అని ఎదురు చూస్తోంది. ఒకసారి ఆహారం కోసం వెళ్లి వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు. ఆ గుడ్లను  సముద్రుని అలలే లాక్కు పోయాయని అర్థమైంది పిచ్చుకు. వాటిని ఎలాగైనా తీసుకురావాలని నిర్ణయించుకుంది పిచ్చుక. "ఓ సముద్రుడా! నా గుడ్లను ఒడ్డుకు చేర్చు" అంటూ సముద్రుని బతిమాలింది పిచ్చుక. సముద్రుడు నవ్వి ఊరుకున్నాడు. పిచ్చుక కోపంగా “నా గుడ్లను తెచ్చివ్వకపోతే, నీ నీళ్లన్నీ తోడేస్తా" అంటూ భయపెట్టింది పిచ్చుక.  ఈసారి సముద్రుడు ఫకపకా నవ్వాడు. వెంటనే పిచ్చుక కోపంతో తన ముక్కుతో కొంచెం కొంచెంగా నీళ్లు తీయడం మొదలు పెట్టింది. అది చూసి...

27 వ రోజు

ఆశావాదంతో ఉండాలి         (pic courtesy: realsimple) జీవితంలో వెలుగునీడలు సహజం  సుఖదుఃఖాలు అనేది ఎప్పుడూ ఒకదాని వెనుక వస్తూ ఉంటాయి. విజయాలు వైఫల్యాలు కూడా అంతే. అపజయాలు కలిగినా నిరాశ కలిగినా  ఆ జాడ్యాన్ని వదిలించుకోవాలి. మళ్లీ ఆశావాదంతో ముందుకెళ్లాలి. జీవితం చేదు తీపి కలయిక.

26 వ రోజు

విజయానికి వ్యూహాలు         ( Pic source: smartprix ) విజయం ఒక ఆట లాంటిది కొత్త ఆట ఆడటానికి కొత్త ఐడియాలు కొత్త సాధనాలు కొత్త వనరులు కొత్త శక్తులను ఉపయోగించుకోవాలి. నీ గురించి మర్చిపో ఇతరుల గురించి దృష్టి పెట్టు నష్టాల గురించి కాక అవకాశాల గురించి ఆలోచించు కష్టాలను చూసుకోకుండా పురోగతిపై మనసు పెట్టాలి  భవిష్యత్తు ఎలా అనే బదులు నేడు ఏమిటి అన్నది ప్రధానం రోజులో 24 గంటలూ ఏం చేయగలవు? మనసు ఈ క్షణం పై లగ్నం చేస్తే భవిష్యత్తు నీ చేతిలో ఉంటుంది

25 వ రోజు

              (pic source: medium) విజయం సాధించాలి అనుకుంటే నువ్వు ఏం చేస్తున్నావో తెలిసి ఉండాలి. అలాగే నువ్వేం చేస్తున్నావో దాన్ని ప్రేమించాలి.ఇంకా నువ్వు చేస్తున్న పనిలో ఫలితం సాధించగలనన్న సంపూర్ణ విశ్వాసం ఉండాలి.                              --- విల్ రోగర్స్ విజయం సాధించడానికి గుర్తుంచుకోవాల్సిన అంశాలు 1.లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. వాటిని పేపర్ పై  రాసుకోవాలి. 2. ఒకేసారి ఎక్కువ లక్ష్యాలను పూర్తి చేయాలని అనుకోరాదు. 3.ఒక లక్ష్యాన్ని పూర్తిగా ఏకాగ్రత గా ఉండి పూర్తి చేయాలి. 4.లక్ష్యం పూర్తవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి.ఆలోచన ముఖ్యమే గాని ఆలోచనను కార్యాచరణలోకి పెట్టకపోతే ఏం లాభం లేదు. 5.కార్యాచరణతో అన్నీ జరిగి పోవు. వైఫల్యాలు వస్తాయి. వైఫల్యాలే విజయానికి సోపానాలుగా భావించాలి. 6.క్రింద పడటం కాదు. పడిన ప్రతిసారి లేచి నిలబడాలి. 7.లక్ష్యాన్ని పూర్తి చేయడానికి గడువు పెట్టుకోవాలి. 8.లక్ష్యాన్ని చిన్నచిన ముక్కలుగా విడగొట్టాలి. ప్రతి చిన్న లక్ష్యాన్ని పూర్తి చేయాలి. 9....

24 వ రోజు

                  (pic source: slideshare) స్వయం విశ్లేషణ చేసుకునేటప్పుడు మూడు విషయాలపై దృష్టి పెట్టాలి  1 తనకి అత్యంత ప్రియమైన రంగం లేదా పని ఏది?  2 తనకు ప్రియమైన విషయాలు ఏమిటి?   3 తనకు భయం కలిగించే అంశాలు ఏమిటి?

23వ రోజు

                                     (pic source: Quora) ఆత్మ పరిశీలన వ్యక్తిగత సామర్థ్యానికి చాలా అవసరం                                                                          __ బెన్ ఫ్రాంక్లిన్       నిద్రపోయే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కొంత కాలం ఇలా చేస్తే తప్పులు తగ్గి సామర్థ్యం బాగా పెరుగుతుంది.      మన ఆలోచనా విధానంలోనూ, ప్రవర్తన లోనూ ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటే మళ్లీ ఆ తప్పు జరగకుండా ఉండటానికి అవకాశం ఉంది.        ఆత్మవంచన అతి పెద్ద రోగం.           The simplest meaning of self-introspection is self-analysis. It will help you to know about your weakness & strength. It is important to understan...

22వ రోజు

విజయ శిఖరాలను అందుకున్న వారు వాటిని యాదృచ్చికంగా అందుకోలేదు వారి సహచరులు సుఖనిద్ర లో ఉండగా వీళ్ళు అంతర్మథనంలో అహరహం శ్రమించారు                                    ___లాంగ్ ఫెలో ఇతరులు చేయడానికి ఇష్టపడని పనులను కూడా విజేతలు చేస్తారు. ఎప్పుడు వాయిదా వేస్తూ ఉండే పనులు చేపడతారు. అరుణిమ సిన్హా(2013,lag amputee),   ఎరిక్ వెయిన్ మేయర్(2001, blind)   వీరు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. వారి ప్రత్యేకత ఏమంటే వారంతా వికలాంగులు కావడం. ఎవరెస్టు శిఖరం మానవుని సంకల్ప బలానికి మరోమారు శిరసు వంచి నమస్కరించింది. గుండె, సూర్యుడు, భూమి ఇవి ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి. ఇవి వాయిదాకు వ్యతిరేకం. వాయిదా తత్వం మీ అభివృద్ధికి ఆటంకం. ఈరోజు అనుకొన్న పనిని ఆరోజే పూర్తి చేయాలి. చేయాల్సిన పనులు కాగితంపై రాసుకొని వాటిని సాయంత్రం లోపు పూర్తి చేయాలి.

21వ రోజు

అష్ట దుష్ట శక్తులు 1 పరాజయభయం  2 ప్రాధాన్యతా క్రమం మార్పు( ముఖ్యమైన పనిని చివర చేయడం) 3 అనిశ్చితి  (స్పష్టత లేకపోవడం) 4 ఏకాంత నిర్వేదం (ఒంటరిగా బాధపడటం) 5 అసూయాగ్ని (మనసులో ఇతరులను చూసి ఓర్వలేక పోవడం) 6 ఆగ్రహజ్వాల (కోపం) 7 నిరాశ  8 తెలియని భయం  వీటిని పారద్రోలాలి

20వ రోజు

భావవ్యక్తీకరణ మన్రోబియన్ అనే పరిశోధకుని ప్రకారం ఎదుటి వ్యక్తిపై మన ప్రభావం మనం చూపే భావవ్యక్తీకరణ పై  ఆధారపడి ఉంటుంది.    55% మన మన శరీర భంగిమ ద్వారా   38% మన గొంతులో చూపేస్తాయీ మార్పుల ద్వారా    7% కేవలం మాట్లాడే పదాల ద్వారా  మన ప్రభావం ఎదుటి వ్యక్తిపై ఉంటుందట.   అంటే మన శరీర భంగిమ ప్రధానమని   తేటతెల్లమైంది. భావ వ్యక్తీకరణ నైపుణ్యం మెరుగుపరుచు కోవడానికి కింది సూచనలు ఉపయోగపడతాయి. *    ఇతరులతో మీ ప్రవర్తన ఎలా ఉందనే విషయాన్ని గుర్తెరిగి ఉండటం అవసరం.(ఎరుక) *    మీ ప్రవర్తనకు మీరే బాధ్యత వహించగలగాలి. పొరపాట్లకు బాధ్యత వహించడానికి వెనుకాడకూడదు. ఇతరులతో మీ ప్రవర్తన ఎలా ఉన్నదనే విషయం వారిని అడిగి తెలుసుకోవడం ఉపయోగకరం.(బాధ్యత) *    ఇతరులతో వ్యవహరించేటపుడు హావభావాలకు చాలా ప్రాముఖ్యం ఇవ్వాలి. మాటలూ చేతలూ ఒకదానితో ఒకటి ఏకీభవించకపోతే సాంఘిక వాతావరణంలో ఇబ్బందులు ఎదురవుతాయి.(హావభావాలు) *    భావ వ్యక్తీకరణ నైపుణ్యం పెంచుకోవడానికి ఉత్తమ మార్గం- శ్రద్ధగా వినడం! అవతలి వ్యక్తి చెప్పే విషయం మీద...

19 వ రోజు

7 lovely logics( 19వ రోజు) 1) Make peace with your past. so it doesn't spoil your present.గతం గతః. వర్తమానం లో ఉండండి. ఈ క్షణాన్ని అనుభవించు అన్నాడు బుద్దుడు. 2) What others think of you is none of your business ఎవరో నీ గురించి అనుకుంటారని మనసులో మదనపడరాదు. 3) Time heals almost everything, give the time, some time. కాలమే మన సమస్యలకు దారి చూపుతుంది. ఓపిక పట్టాలి. అట్లని ప్రయత్నం మానరాదు. 4) No one is the reason of your happiness,except YOU yourself. నీ సుఖానికి దుఃఖానికి నీవే కారణం. వేరేవరో కాదు. 5) Don't compare your life with others, you have no idea what their journey is all about. ఇతరుల జీవితాలతో పోల్చుకోరాదు. ఎవరి జీవిత ప్రయాణం ఎలా ఉంటుందో మనకు తెలీదు. 6) Stop thinking too much, its alright not to know all the answers. ఒక విషయం పై నిరంతర మథనం ఆపేయాలి.అన్నింటికీ సమాధానాలు కనుగొనాలని ప్రయత్నం చేయవద్దు. వాటిని అలా ఉండనిద్దాం. 7) Smile, you don't own all the problems in the world. ప్రపంచంలో ని సకల దుఃఖాలను మీదేసుకోవద్దు.అన్ని సమస్యలను మనం పరిష్కరించలేం. నవ్వండి. పరిశుద్ధ మన...

16వ రోజు

పనిలో ఫలితం రావాలంటే ఆలోచనా సరళి మార్చుకోవాలి  పని చేసే విధానం మార్చుకోవాలి  ఫీలింగ్స్ మార్చుకోవాలి  అప్పుడు ఫలితాలలో అభివృద్ధిని సాధించవచ్చు  ఆలోచనలు ఆశావాదంతో ఉండాలి  మనం చేస్తున్న పని ఎదుటివారిని ఆకట్టుకునేలా  ఉండాలి  విజయం సాధించినప్పుడు   కలిగే ఉత్సాహం, ఆనందం  పని చేస్తున్నప్పుడు,  ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా  అదే ఉత్సాహం, ఆనందం తో ఉండాలి.  ఆలోచనలు+ పనులు +అనుభూతి =వచ్చే ఫలితం

15వ రోజు

15వ రోజు ఈ లక్షణాలను అలవర్చుకోవడానికి నిరంతరం అభ్యాసం చేయాలి. ఇవి విశిష్ట లక్షణాలు. ఇవి  ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. సంభాషణా చాతుర్యం  సమయస్ఫూర్తి  బాధ్యత  సానుకూల దృక్పథం చిరునవ్వు  సత్సబంధాలు  విలువలకు ప్రాధాన్యత  ఆనందంగా పని చేయడం  సృజనాత్మకత  కలిసిమెలిసి పనిచేయడం  చొరవ

14వ రోజు

                               పని నీడలో  కూర్చుని ఉంటే పూలతోట తయారవదు                            __రుడ్ యార్డ్ కిప్లింగ్ నమ్మకాన్ని పెంచి మనల్ని నడిపించేది పని ఒక్కటే ఊహల్ని ప్రేరేపించేది పని ఒక్కటే  లక్ష్యానికి చేరువ చేసేది పని ఒక్కటే  కలల్ని సాకారం చేసేది పని ఒక్కటే  పని పని కి దారి తీస్తుంది  ఇది చైతన్య సూత్రం  ఇది మారనిది  ఇది విశ్వజనీనం  దరిద్రం, చెడుభావనలు, విసుగు అనే  మూడు  మానసిక జబ్బులను  ఒక్క పని నివారిస్తుంది.

13వ రోజు

13వ రోజు కార్యాచరణను మొండి బలం తోనూ  నిరంతర ప్రవాహాన్ని మేధస్సుతో పోల్చవచ్చు. ప్రవాహం కు ఆటంకంగా గల గల పారుతున్న కొండరాళ్లు అనేకం ఉంటాయి అయినా ప్రవాహ ఉధృతిని అవి ఆపలేవు. చిన్న ప్లానింగ్ విజయానికి ప్రాణవాయువు. శ్రమ వ్యర్థమైనా చివరకు ఫలితమే కదా కావాల్సింది. ప్రయత్నం వల్ల సాధ్యం కానిది ఏమీ లేదు. రోజులో 24 గంటలను  మనం ఎలా గడుపుతున్నామని దాని పైనే మన జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. ప్రపంచంలో మూడు రకాల వ్యక్తులు ఉన్నారు పనులు చేసే వారు. పనులు జరుగుతుండగా చూసే వారు. ఏం జరిగిందని ఆశ్చర్యపోయేవారు.  మీరు ఎప్పుడూ పనులు చేసేవారుగా ఉండండి. చేయాలనుకున్న పనిని మొదలు పెట్టు.  మధ్యలో నిలిపివేయకు. విజయలక్ష్మి వరిస్తుంది. రోజుకు 5 ముఖ్యమైన పనులు రాసుకుని వాటిని పూర్తిచేయాలి. అప్పుడు నెలకు నూరు పనులు,సంవత్సరానికి మూడు వందల చిన్న పనులు చేయగలుగుతాం.

12వ రోజు

12వ రోజు అలవాటు చేసుకోవాల్సినవి అలవాటైన వేల కంటే ముందే నిద్రలేచి లేవటం ఇరవై ఒక్క రోజులు సాధన చేస్తే అది ఒక  అలవాటుగా మారిపోతుందని ఒక సూత్రం. పాటించి చూడండి. కష్టాలను బాధలను కాగితం పెట్టడం అలవాటు చేసుకోవాలి.మనసు లో బరువు దిగిపోయి ఖాళీ అవుతుంది. ఏదైనా విన్నా లేదా చదివినా అందమైన మాటలను, కవితలను రాసి పెట్టుకోవాలి. గుర్తుంచుకోవాలి. చీటికిమాటికి లక్ష్యాలు మార్చుకోరాదు. పాత లక్ష్యాల స్థానంలో కొత్తవి వస్తాయి. పాతవి గాలిలో కలిసిపోతాయిి. అలా చేయరాదు ప్రతిరోజు మనసులోకి వచ్చే ఆలోచనలను కాగితంపై రాసి పెట్టుకోవాలి. స్ఫూర్తినిచ్చే కవితా పంక్తులను లేదా పాటల చరణాలను గుర్తుంచుకోండి. అది మీ జ్ఞాపకశక్తికి తోడ్పడ్డాయి. వాటిని సందర్భానుసారంగా ఉపయోగించుకుంటే  మేధావివర్గం గా తయారవుతారు.అందుకు తగిన ఉత్సాహం వస్తుంది. 30 నిమిషాలు శరీర వ్యాయామం రోజూచేయాలి. పదిహేను నిమిషాలు ధ్యానం  చేయాలి. శరీరాన్ని ఎలా శుభ్రం చేస్తామో అలా మెదడును ధ్యానం తో శుభ్రం చేసుకోవాలి. అద్భుతాలు సాధిస్తానని దగ్గరగా చదవాలి. జర్నల్ రాయటం అలవాటు చేసుకోవాలి. వింటున్నప్పుడు మాట్లాడకూడదు. ప్రతిరోజూ ఒక కొత్త వ్యక్తిని...

11వ రోజు

11వ రోజు ACT ఫార్ములా A Acknowledge అంగీకరించడం C Choose ఎంపిక T Track మార్గాన్ని చేపట్టడం Acknowledge మార్పుకు అంగీకరించాలి                            మార్పుకు  సిద్ధపడాలి Choose         లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి Track           లక్ష్యాన్ని గమ్యస్థానంగా గుర్తించాలి  Act               కార్యాచరణ చేపట్టాలి.                      అప్పుడు  లక్ష్యాన్ని చేపట్టగలం.

10 వ రోజు

పదో రోజు నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి మార్గాలు 1. ప్రగతి సాధిస్తున్న వ్యక్తి బాగా పొగడాలి. ప్రోత్సహించాలి. ఇదేనా నీ ప్రగతి అని ఎద్దేవా చేయరాదు. 2.తన అవసరాలనే కాదు తన టీమ్ అవసరాలను గుర్తించే వాడే నిజమైన నాయకుడు. 3. ద్వేషం భయం నేర మనస్తత్వం ఉండరాదు. ఇవి ప్రమాదకర శత్రువులు. 4.వ్యాపారంలో మూడు ముఖ్యమైన విషయాలు అవసరం అవి 1. ధైర్యం 2.ధైర్యం 3.ధైర్యం 5. ఉత్సాహం ఎన్నో అద్భుతాలు చేస్తుంది. అది బద్ధకాన్ని వదిలిపెడుతుంది.నాయకుడెపుడూ ఉత్సాహంగా ఉండాలి. 6.ఇతరులను మార్చాలంటే ముందు మీరు మారాల్సి ఉంటుంది మీరు మారి ఆచరిస్తే ఇతరులు మిమ్మల్ని అనుసరిస్తారు. 7.మీరు చేస్తున్న పని వల్ల అనుకున్న ఫలితం రాకపోతే పాత పద్ధతిని వదిలిపెట్టి కొత్త పద్ధతిని ప్రయత్నించాలి. 8.నాయకునికి తప్పనిసరిగా లక్ష్యం ఉండాలి. లక్ష్యం సాధించాలనే పట్టుదల ఉండాలి. 9.ఎంత ఒత్తిడి ఉన్నా హుందాగా ప్రవర్తించాలి. ఒత్తిడితో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించడం నిజమైన నాయకత్వ లక్షణం                                     __జోసఫ్ కెన్నెడీ.

9వ రోజు

తొమ్మిదవ రోజు  క్రింది ఆరోగ్యాన్ని పెంపొందించు కోవాలి 1. శారీరక ఆరోగ్యం     సమతుల ఆహారం తీసుకుని రోజూ        వ్యాయామం చేయాలి దేహమే దేవాలయం      ఆహార ఔషధం ఈ సూత్రాన్ని గుర్తు పెట్టుకోవాలి 2.మానసిక ఆరోగ్యం      మంచి పుస్తకాలను రోజూ చదువుతూ ఉండాలి      ఉన్నత వ్యక్తిత్వం గల వారిని కలుస్తూ వారి      పరిచయం పెంచుకోవాలి మంచి మిత్రుల       స్నేహం చేస్తూ ఉండాలి 3.ఉద్వేగ ఆరోగ్యం      వివిధ భావాలను స్వీకరించడానికి సిద్ధంగా        ఉండాలి స్వీకరించిన భావాలను వ్యక్తీకరించే     రాలి రోజూ ఎదురయ్యే అనేక ఉద్వేగాలను    తట్టుకుని నిలబడగల గడ్డం చాలా ముఖ్యం ఇది    ఉద్వేగ  ఆరోగ్యానికి చిహ్నం 4.మానసిక ఆరోగ్యం     మానసిక కాలుష్యం కాలకూట విషం కన్నా     ప్రమాదకరమైనది.

8వ రోజు

8 వ రోజు విజయ సాధకులు ఇవన్నీ కలిగి ఉంటారు. Traits of  success achievers 1. ఆత్మ విశ్వాసం  2. మానసిక సామర్థ్యం  3 ఆరోగ్యం  4 విజ్ఞానం  5. విజ్ఞత  6. నైపుణ్యం  7.ఉత్సాహం  8.విచక్షణ  9.ధైర్యం  10.కఠోర శ్రమ  12.కార్యాచరణ  13.ఓపిక

7వ రోజు

7వ రోజు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి 1. ఈ ప్రపంచంలో నా ఉనికి ఏమిటి? 2. నా జీవితం యొక్క ప్రయోజనం ప్రయోజకత్వం ఏమిటి? 3 విలువలకు సంబంధించినంతవరకూ నాకు కావాల్సింది ఏమిటి? 4. ప్రతిరోజు ఉదయాన్నే ఎందుకు నిద్రలే స్తున్నావు? 5.ఈ ప్రపంచంలో నీకు అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు? 6.ఈ ప్రపంచాన్ని వదిలే నాటికి ఏమి సాధించాలని అనుకుంటున్నావు? 7.నీ జీవితంలో  నిజంగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు?

6వ రోజు

6వ రోజు 1.మన నమ్మకమే మన సామర్థ్యం     కెపాసిటీ  ఈజ్ ఈక్వల్ టు బి లీఫ్  2. నమ్మకం మనిషిని చేస్తుంది లేదా నేలకు పడేటట్లు చేస్తుంది  3.   వేయి దేవుళ్ళ మీద నమ్మకం ఉన్నా నీ మీద నీకు నమ్మకం లేకపోతే  నీ జీవితంలో నీవు ముందుకి వెళ్ళలేవు అనన్నాడు వివేకానందుడు.     4.నిన్ను నీవు నమ్మితే నీ శక్తులన్నీ నీ ఎంపికలోనే ఏకీకృతం చేస్తావు 5.నీ వెనుక నీవు నిలబడిన వాడు నీ విజయావకాశాలు ఒకటికి పదింతలవుతాయి                             -- చెర్రీ కార్టర్ స్కాట్ 6.నేను ఇది చేయగలను అని దృఢంగా అనుకున్నప్పుడు నీ మెదడు దాన్ని ఎలా సాధించాలో ఆలోచిస్తుంది. 7.నిజజీవితంలో ప్రతి పెద్ద వ్యాపారం నమ్మకం అనే మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది. 8.పెరుగుదల అనేది పిరమిడ్ లాంటిది దాని మీద నిలబడడానికి చోటు ఉండదనే నమ్మకం మనిషిని పైకి ఎదగనివ్వదు. 9.అనుమానం ఉన్న వాడు బలహీనుడు. బలమైన గట్టి నమ్మకం ఉంటాయి గొప్ప గొప్ప పనుల వెనక.                     ...

5వ రోజు

5వ రోజు సానుకూల దృక్పథాన్ని పెంచుకునే ఆలోచనలు 1. అంతా మన మంచికే అనుకోవాలి.   2 నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. 3. మనం సరిగ్గా ఉంటే ప్రపంచం కూడా సరిగా ఉంటుంది. 4. మంచివాళ్ళకు ఆపద వచ్చినా వాటివల్ల వారే ఎదుగుతారు తప్ప కుంగి పోరు. 5. జీవించడం ఒక కళ. దాన్ని ఎవరూ నేర్పలేరు. పుస్తకాలు చదవడం ద్వారా కొంత అనుభవం ద్వారా ఆ కళను నేర్చుకోవచ్చు. 6.అనుభవమే పాఠశాల.జీవితం ఒక సాహసకృత్యం కావాలి గాని ప్రముఖంగా ఉండరాదు. 7. ఉద్రేకాలను అదుపు చేసుకున్నవారే జీవితంలో ఆనందంగా ఉండగలరు. 8. ఓపిగ్గా ఉండి పని చేస్తూ పోతే విజయం తప్పక వస్తుంది. 9  ఐ యాం ఓకే . యు ఆర్ ఓ కే.ఇది బెస్ట్ ఫిలాసఫీ.

18 వ రోజు

విజయం కోసం.... సంకల్పం,సహనం,పట్టుదల - విజయాన్ని సాధించడానికి ఈ మూడు అత్యంత అవసరం. వీటన్నిటికీ మించి కావలసింది    లక్ష్య శుద్ది మొదట ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి.  మీరు చిన్న బుడగలాంటి వారై ఉండవచ్చు. ఇంకొకరు శిఖరాగ్రమంత ఎత్తయిన కెరటమే కావచ్చు. అయినా అపరిమితమైన సముద్రమే ఆ రెండింటికీ ఆధారం అని మరిచి పోవద్దు. ధైర్యశాలిగా ముందుకు నడవండి .  ఒక్క రోజులోనో, ఒక్క సంవత్సరంలోనో విజయాన్ని ఆశించ కుండా. ఎల్లప్పుడూ మీరు చేసే నిత్య కృషి మీ యొక్క దీర్ఘ కాలిక లక్ష్య సాధనలో భాగమని గుర్తించండి. ఉత్తమోత్తమమైన ఆదర్శాన్ని కలిగి ఉండాలి.  స్థిరత్వం కలిగి ఉండాలి. చరిత్రలో గొప్ప వ్యక్తులను పరికిస్తే; వారు తప్పుల నుండి, దుఃఖాల నుండి కొత్త పాఠాలను నేర్చుకొని గొప్పవారయ్యారని తేటతెల్లమౌతుంది. అపజయమనే భయం తొలగితేనే విజయమనే నిజమైన సుఖసంతోషాలు కలుగుతాయి. మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచన, పలుకు మాత్రమే ఈ లోకంలో ఉన్న కీడు అని గ్రహించండి  మనిషిని బలహీనపరచే, మనిషికి భయాన్ని కలిగించే దానిని మాత్రమే చెడుగా, భావించి తిరస్కరించండి.  మానసిక బల సంపన్నులు కండి.  కలలు కనండి.క...

17 వ రోజు

Make up your mind 1.Pressure can make diamonds 2. When pressure arises what do you do? You have two options.  a) you use pressure to make you stronger and better b) you use pressure to make you weaker and bitter 3. Start think differently. 4.Think positively.Concetrate on what you want. Don't think on what you don't want . Your first step is critical. 5.You have to go beyond your comfort zone. 6. Most people say I hope I can.Make up mind man say  I know I can, I know I will.