Skip to main content

Posts

Showing posts from March, 2021

83 వ రోజు

               Ravivarma ఒక రోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు.             రవివర్మను గుర్తుపట్టిన ఓ అమ్మాయి  సంతోషంతో   ఆయన దగ్గరకు వెళ్ళి  పలకరించి , ఏదైనా చిన్న పేయింటింగ్ గీసి ఇవ్వమని  అభ్యర్థించింది. "బజారులో పేయింటింగ్ ఎలా  చిత్రించడం ? మరోసారి కలిసినపుడు తప్పక  చిత్రాన్ని  వేసిస్తా" అన్నాడు రవివర్మ.    ఆ అమ్మాయి  మొండిగా  మారాం చేసింది. ఆమెను నొప్పించలేక  ఒక పేపర్ పై  అప్పటికప్పుడు  చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు రవి.  ఇస్తూ ఇస్తూ  నవ్వుతూ   "దీని విలువ  కోటి రూపాయలు.జాగ్రత్తగా కాపాడుకో." అన్నాడు        ఆ అమ్మాయి  ఆశ్చర్యంగా ఆ పెయింటింగ్   చూస్తూ ఉండి పోయింది.         మరుసటి రోజు  ప్రముఖ చిత్రకారుల చిత్రాలు  అమ్మే వ్యక్తిని కలిసి "ఇది రవివర్మ గీసిన చిత్రం. దీన్ని  అమ్మితే ఎంత ధరకు అమ్ముడు పోతుంది?"...

82వ రోజు

మన ఆలోచనల ప్రతిబింబమే మన వ్యక్తిత్వం                                                   జేమ్స్ అలెన్ రాసిన "యాజ్ ఎ మ్యాన్ థింకెథ్" పుస్తకాన్ని డా: మృణాళిని "మనిషంటే అతని ఆలోచనలే" అని తెలుగులో మంచి భాషా పదబంధాలతో అనువదించారు. ప్రతి వ్యక్తికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. మనస్సులో ఉదయించిన ఆలోచనలు మెల్లగా కార్యరూపం దాలుస్తాయి. దీన్నే భావం బౌతికరూపం దాల్చటం అంటాం. మనం చేసే పనులు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. మనం ఏం మాట్లాడుతామో అది మన వ్యక్తిత్వాన్ని తెలియజేయవు. మనం చేసే కార్యాచరణే గీటురాయి. మనం చేసే పనులు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. అందుకనే మన ఆలోచనా విధానం మన జీవితాన్ని విర్దేశిస్తుంది. మన భవిష్యత్తుకు ఎవరు బాధ్యులు? మనమే. కానీ చాలా మంది అదృష్టమని లేదాదురదృష్టమని లేదా మరొకరి నయవంచన అని కొంతమంది చెపుతుంటారు. ఇది పూర్తిగా తప్పని చెప్పుతారు. జేమ్స్ అలెన్.           మనం ఏంకావాలని కోరుకుంటామో అదే అవుతాము. మన సంకల్పమే మనల్ని ముం...

81వ రోజు

       pc dreamstime.com ఒక్కరోజులోనే ఎవరూ  ఉన్నతిని సాధించలేరు.          బ్రతుకు పూలబాట కాదు అది పరవసించి పాడుకునే పాటగాదు....అనే పాట మీరు వినే వుంటారు. జీవితం విరిపాన్పుకాదు. అది వడ్డించిన విస్తరికాదు. అందులో ముల్లుంటాయి. రాల్లుంటాయి.    మధ్యలో అక్కడక్కడ ఎడారిలో ఒయాసిస్సులా కొన్ని పూలు వికసించొచ్చు.  జీవితం ఒక వంకరటింకరమార్గం. అనేక మలుపులుంటాయి. జాగ్రత్తగా వెళ్లాల్సిందే. జీవితం ఒక వంకరటింకర శిల.దాన్ని శిల్పంలా మనకు మనమే  చెక్కుకోవాలి. కొన్ని కలలు, కొన్ని నమ్మకాలు, కొంతబాధ, కొంత సంతోషం, విజయాలు, వైఫల్యాల సమాహారమే జీవితం. జీవితం బ్రాంతికాదు. అది రంగులకల అంతకన్నా కాదు. జీవితం ఒక సాహసం, అదొక అనుభవం, అనుభవాల పరంపరే జీవితం. అనుభవాలనే నిఘంటువులో ప్రతి వ్యక్తి జీవితం ఒక పేజీ లాంటిది.        ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో సాధించాలని పై స్థాయిలో వుండాలని అందరి కన్నా ఒక మెట్టులో వుండాలని, ఏదో ఒక రంగంలో రాణించాలని కలలు కనేవుంటారు. విజయం కోసం తపన పడే వుంటారు. ఎవరైతే  నేను చేయగలనన్న ఆత్మవిశ్వా...

80వ రోజు

Your success is the result of not only your efforts, it is a combination of several other factors and  support systems Here is the story from Mahabharatham While the battle of Kurukshetra was at its peak, Arjuna and Karna were fighting cach other. It was a battle to witness, a flurry of arrows were being exchanged, and even the gods were witnessing this epic battle between the two warriors       Arjuna would shoot his arrows and the impact of these arrows was so intense that Karna's chariot would go back by 25-30 feet. People who witnessed this were amazed by the skills of Arjuna.        Karna was no less. When he shot arrows, Arjuna's chariot would also shake and go back by three-four feet. More than anyone else, Krishna would applaud Karna every time his  arrow hit Arjuna's chariot. But not once did he applaud Arjuna's skills.       At the end of the day Arjuna asked  Krishna "O my lord,I have shot so many arrows at Karn...

79వ రోజు

   How Do You Actually Learn To Love Yourself? Inner bonding is a powerful six-step self-healing process that offers a road map for learning to love yourself. Learning and practicing these six steps will gradually result in loving yourself rather than continuing to abandon yourself.   The Six Steps Of Inner Bonding: 1. Be willing to feel pain and take responsibility for your feelings. All feelings are informational, letting us know whether we're loving ourselves or abandoning ourselves, or if others are being loving or controlling. Step one is mindfully following your breath to get present in your body, and compassionately embracing all feelings. It's about moving toward your feelings rather than away from them with various forms of self-abandonment, such as staying focused in your head, judging yourself, turning to addictions to numb out, or making someone else responsible for your feelings.   2. Move into the intent to learn. In inner bonding, there are only two po...

78వ రోజు

Watch your thoughts; They become words. Watch your words; They become actions. Watch your actions; They become habits. Watch your habits; They become character. Watch your character; It becomes your destiny.                                            __Lao Tzu Lao Tzu(లావొట్జే) was an ancient Chinese philosopher and writer.He is the reputed author of the Tao Te Ching, the founder of philosophical Taoism, and a deity in religious Taoism and traditional Chinese religions.(టావోయిజం ప్రారంభించిన వ్యక్తి)

77వ రోజు

   pc: Hopegrows.net I am like grass You can chop me mow me down  But I shall sprout again  Grow  and bounce back Heard melodies are sweet- those unheard are sweeter ___Keats But l have promises to keep And miles to go before l sleep❤ ___Robert Frost If winter comes can spring be far behind A thing of beauty is a joy forever... Heard melodies are sweet unheard are...   ____Keats

76 వ రోజు

          అందమే ఆనందం ,ఆనందమే జీవిత మకరందం అన్నారు సినీ కవి. అలాంటి ఆనందం కోసం ఇవిగో పది సూత్రాలు 1. ఏదో ఒక పనిలో నిమగ్నమై చురుకుగా ఉండాలి. 2 .గందరగోళం లేకుండా ప్రణాళికా బద్ధమైన జీవితాన్ని గడపాలి. 3 .ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. 4. సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి 5 .చిన్న చిన్న విషయాలపై అనవసర ఆందోళన పడరాదు 6. వినోదం కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. 7. ఇతరులపై ప్రేమను కలిగి ఉండాలి. 8 .పుచ్చుకునే దానికన్నా ఎక్కువ ఇచ్చే అలవాటు పెంచుకోవాలి. 9 .వర్తమానంలో జీవించాలి. గతం గతః అనుకోవాలి. 10 రోజూ చిన్న చిన్న లక్ష్యాలు నిర్ణయించుకొని వాటిని పూర్తి చేస్తూ ఉండాలి.

75వ రోజు

       pc anandaindia.com 🌿ఆనందంగా ఉండాలనుకుంటున్నారా ? అయితే కొన్ని నిమిషాలు మీ కోసం కేటాయించండి.    మంచిదే   ఇన్నాళ్ళకు   మంచి ఆలోచన వచ్చింది....   మన ఇల్లు  శుభ్రంగా,  అందంగా,  ప్రశాంతంగా ఉండాలనుకుంటే   మనం ఏమి చేయాలి.....   ఇంటికి పట్టిన బూజు, చెత్త, చెదారం  తొలగించాలి.  ఇంట్లో సామాన్లు అన్ని  ఒక పధ్ధతి లొ ఉంచాలి.  పనికి రాని వస్తువులు,  ఇంట్లో అడ్డంగా ఉపయోగం లేకుండా ఉన్న వస్తువులు  బయట పడేయాలి   అంతే కదా...... మరి మనం ఆనందంగా ఉండాలంటే చేయవలసినది   అదే.......  ముందు  ఇప్పటికే మన మనస్సుల్లో ఉన్న చెత్త..   మన ప్రవర్తనలో ఉన్న  చెడు అలవాట్లు  జాగ్రత్తగా నేర్పుగా ఓర్పుగా అవతల పారేయాలి.....  ఆనందంగా   ఉండాలంటే    మనలో తొలగించుకోవలసిన  మరియు  వదిలించుకోవలసిన  ఈ చెత్త  ఏమిటో చూద్దాం....... 🌿1.  పనికిమాలిన  మరియు ఇబ్బంది పెడుతున్న బంధాలను, బంధుత్వాలను ...

73వ రోజు

      pc: differencebetween info.com ఆత్మలను పలికించేదే అసలైన భాష                                                    __సినారె చర్చ విజ్ఞానానికి మూలం. వాదన అజ్ఞానానికి పరాకాష్ట.  వాదన కేవలం కాలహరణకు, అభిప్రాయభేదాలకు దారితీస్తుంది. మీరు ఏ వ్యక్తి వద్ద పని చేస్తున్నారో అతనితో వాదులాటకు దిగరాదు.         pc: differencebetween info.com ఒక చిన్న వాదన మీరెన్నో కోల్పోయేటట్లు చేస్తుంది.  సంయనంతో వ్యవహరించాలి.  వాదన వల్ల ఎప్పుడు విజయం రాదు. మీరు వాదనలో ఎంత ఎక్కువ నెగ్గితే మీకు అంత తక్కువ స్నేహితులు ఉంటారు.

74వ రోజు

pc: YouTube బాధపడటం సోమరి లక్షణం. దాన్ని వదిలేయండి. + మీ కెప్పుడయినా బాధ కలిగితే - వెంటనే చేయాల్సిన పనులు గుర్తుతెచ్చుకొని చేయండి. మీ బాధ తొలగిపోతుంది. + నిరంతరం పనిచేస్తూ పోయేవాడికి సమస్యలు పరిష్కరించడం కూడా సులభమే. + గొప్ప తెలివి తేటలు లేకపోయినా - సోమరితనం లేకుంటే విజయం  సొంతమవుతుంది.

72 వ రోజు

ప్రేమ    ఈ సృష్టిలో అత్యున్నతమైన భావం ప్రేమే. ప్రేమతో సర్వం సాధ్యమే. 🔸ప్రేమతో జీవించడం అంటే  అత్యున్నతమైన జ్ఞానంతో జీవించడమే. 🔸మనం చేసే ప్రతి పని ప్రేమతో చేయడం ద్వారా జీవితం పరిపూర్ణం అవుతుంది. 🔸 నీ పట్ల నీవు ప్రేమను కలిగి ఉంటే జీవితంలోని అన్ని కోణాలలో నీకు శుభమే కలుగుతుంది. 🔸 నిన్ను నీవు ప్రేమించుకోవడం మొదలు పెట్టిన వెంటనే నీకు స్వస్థత మొదలవుతుంది.  🔸 ధ్యానం చేయడం అంటే  నిన్ను నీవు అత్యున్నతంగా ప్రేమించుకోవడమే. 🔸 "నన్ను నేను ప్రేమించుకుంటున్నాను" అని మనసులో అనేక సార్లు మననం చేసినా కూడా అద్భుతమైన ప్రభావం ఉంటుంది. 🔸నీ ఆలోచనలు ప్రేమతో ఉంటే జీవితంలో అన్ని సాధ్యమే.

71 వ రోజు

అందరిపట్ల విధేయత కసపరచండి. కాని మీ నమ్మకాలకు భిన్నంగా  ప్రవర్తించకండి.  విధేయత వల్ల ఓర్పు - సహనం అలవడుతుంది.  మీలోని ఆత్రుతపడే తత్వం తగ్గి ప్రశాంతంగా ఆలోచించగల తత్వం పెరుగుతుంది. విధేయతవల్ల మీకు కావాల్సిన వ్యక్తులను, శక్తులను తేలిగ్గా సమన్వయం చేయగల్లుతాయి. సహకారం పొందగల్గుతారు. మీ చట్టూ వున్నవారు - మీ పట్ల అనుకూల ఆలోచనా ధోరణి కనపరుస్తున్నప్పుడు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

70వరోజు

         ఇక వాడు మారడు. "పుర్రెతో పుట్టిన బుద్ధి పుడకలతోగాని పోదు" అని కొందరి విషయంలో అంటుంటాం. ఎంత వయసొచ్చినా తమ మూర్ఖపు విధానాలను ఏమాత్రం మార్చుకోని వారిని గురించి పైవిధంగా వ్యాఖానిస్తాం.         60-70 ఏళ్ళచ్చినా కొందరిలో అసహనం, తొందరపాటు, కోపం, మొండి పట్టుదల మొదలగు అవలక్షణాలను చూస్తాం. అదే మరి కొందరి విషయంలో చిన్నవయసులోనే సమస్యలను ఎదుర్కొనడంలో నేర్పు, ఓర్పు  సమసంయమనం మొదలైన సద్గుణాలు కనిపిస్తాయి. వయసెక్కు వున్నా కొందరిలో అనుభవరాహిత్యం, చిన్నవయసులోనే కొందరికి మంచి అనుభవం ఎందుకు కలుగుతాయి? అనుభవం లేని వారంతా స్వతహాగా మందబుద్ధులని, అనుభవజ్ఞులంతా స్వభావ రీత్యానే మేధావులని చెప్పలేం.            నిత్యజీవితంలో అనుభవ శూన్యులని మనం ఎవరినైతే  అంటామో వారు తమ వృత్తిని సమర్థవంతంగానిర్వహిస్తుంటారు. బయటి ప్రపంచంతో వారికి సంబంధం వుండదు. వృత్తి స్థానం, ఇల్లు తప్ప ఇతర విషయాలను వారు పట్టించుకోరు.            అలాంటప్పుడు వారికి అనుభవం ఎలా పెరుగుతుంది?మరి అనుభవాన్ని ఎలా పొందుతారు? 1. స్వా...

69 వ రోజు

    pc: fb,     statue of   Thiruvallur   Kanyakumari Tirukkural   1.పేరు ప్రతిష్టలు తెచ్చును ధనం, కాని    మచ్చ లేని మనుషులు ఆ ధనం కొరకు     ఎవరికీ  కలిగించరు హాని.  2.అపకారికైనా కోపంతో చేయకు అపకారం    సహనంతో వ్యవహరించుట నీవు చేసే   ఉపకారం  3.కావాలని చెడు చేసే దుష్టులపై చేస్తే    ప్రతీకారం     తప్పించుకోలేని కష్టాలను కొని తెచ్చుకోవటం  4.నీవు అపకారిని శిక్షించే విధానం     నీవు చేసిన ఉపకారం ద్వారా అతను పొందే     అవమానం.  5.పరుల కష్టాలను తనదిగా భావించలేనినాడు    వివేక వంతుడికైనా కలగదు మంచి ఏనాడు.  6.నీకు బాధ కలిగించే పని    ఎవరికి కలిగించకు అట్టి హాని  7.మనసులోనైనా పరులకు కీడు తలంచకు    మనసు గల మనిషిగా ఎవ్వరికీ తలదించకు  8.కీడువలన కలిగే బాధ తెలిసిన నీవు    పరులకెందుకు కీడు చేయాలని చూస్తావు?  9.నీవు పరులకు అపకారం చేస్తే ఉదయంపూట     న...

68 వ రోజు

          అవసరానికి మించి ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే మీ పరిశీలనాశక్తి పెరుగుతుంది.మీ చుట్టూ జరిగే విషయాలను మీరు పూర్తిగా తెల్సుకోగలుగుతారు.ఎదుటివారు చెప్పేది చక్కగా వినగలుగుతారు. వారికి మీపై అభిమానం పెరుగుతుంది.             అత్యుద్భుతమైన ఏకాగ్రత మీ సొంత మవుతుంది.

67వ రోజు

మీకంటే సెద్ద స్థాయిలో వున్నవాళ్ళపైఎంత గౌొరవం చూపుతారో చిన్న స్థాయిలో వున్నవాళ్ళపై కూడా అంతే గౌరవం అభిమానం చూపండి. అందర్ని సమంగా చూడడం వల్ల మీరు ఎవరి ప్రలోభాలకు లొంగని వ్యక్తిగా మారుతారు. చిన్నస్థాయిలో వున్న వారిపై మీరు చూపే అభిమానానికి రెట్టింపు అభిమానం వారు మీ పట్ల కనపరుస్తారు. మీ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది.

66 వ రోజు

చీకటిని తిట్టే బదులు దీపం వెలిగించు మొదలు        pc physics.stackexchange.com          “ చుట్టూ వున్న చీకటిని తిట్టుకుంటూ కూచోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపమైనా వెలిగించడం మంచిది " హైదరాబాద్ లోని సాహిత్య సంస్థ “ యువభారతి " ఈ వాక్యాలను ' మోటో'గా ప్రకటించించేది . చీకటి , వెలుతురు అనే పరిమితార్థంలోనే గాకుండా ఈ  వాక్యంలో చాలా లోతు వుంది .          చాలా మంది తమ ఇల్లు , వీధి , కార్యాలయం పట్ల విపరీతమైన విసుగును , అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు . అక్కడ ఎవరూ మంచివారు లేరని , ఏమీ చేయలేమని చెప్పబోతారు . మనం ఏదైనా సలహా ఇవ్వబోతే మీకు తెలియ దంటారు . ' మా వూరి సంగతి మీకు తెలియదు ' మా బాస్ సంగతి మీకు తెలియదు ' ఇలా అంటుంటారు . ఆ మాట నిజమే . వారి పరిస్థితులు మనకు తెలియకపోవడమూ సహజమే . అయితే వాటి గురించి అంత తెలిసిన వారు  కూడా ఎందుకు అంత ' ఇదయి ' పోతున్నారో మాత్రం మనకు అర్థం కాదు . ఎప్పుడన్నా తీరిగ్గా వుండి 'ఏంటి మీ ఆఫీసు సంగతులు' అంటే పెద్ద భారతం విప్పుతారు . తీరా వారు చెప్పేవన్నీ సాదా సీదా సమస్యలు , సాధారణంగా వినిపించే ఆ...

65 వ రోజు

       pc enaadu.net త్రికోణ జీవితం  జీవితం మూడింటితో ముడివడి ఉంది. సమరం, సాధన, ఆస్వాదన- ఈ త్రికోణ రూపమే జీవితం పుట్టుక నుంచి పుడమి గర్భంలోకి వెళ్ళేవరకు జీవితం ఓ సమరాన్ని తలపిస్తుంది బతుకు పోరాటం, బతికించడం కోసం ఉనికిని కాపాడుకోవడం, బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్య దశల్లో ధర్మాచరణ, కుటుంబ సౌఖ్యం, సంతానం, ప్రయోజకత్వం వృద్ధాప్యం, బాధలు, వ్యాధులు.... అంతా ఓ సంగ్రామం గ్రహాల గమనస్థితి నుంచి సూక్ష్మ జీవరాశి వరకు క్రియాశీల వైఖరి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మానవాళి జీవితంలో అనుభవాల రాసిళ్లు తప్పేవి కావు. శరీరాన్ని, మనసును, బుద్ధిని ఉపయోగించి మానవుడు జీవన సమరంలో విజేతగా నిలవాలి. సమయానుకూలంగా, సావధానంగా రాదు సమరం. అనునిత్యం అనుక్షణం సమర వాతావరణమే. వైవాహిక జీవితం, గృహస్థాశ్రమం నల్లేరు మీద నడక కావు. సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనుకుంటాడు యజమాని, తన వృద్ధాప్య దశ హాయిగా సాగిపోవాలనుకుంటాడు. కానీ క్షణక్షణానికి మారే మనస్తత్వ వైఖరులు వాతావరణాన్ని అశాంతి పాలు చేయవచ్చు పైను సమస్యలు తీరక పట్టి పీడించనూవచ్చు. వృద్ధాప్యమొక శాపంలా పరిణమించ వచ్చు. ఏ దశ కూడా వడ్డించిన వ...

62 వ రోజు

మీరు జీవించారనడానికి గుర్తు మీ జీవితానికి ఒక లక్ష్యాన్ని కనుక్కోవడం ,దాని పైనే మనసును, బుద్ధిని లగ్నం చేసి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం పై ఆధారపడుతుంది                                            ___ బుద్ధ ఎంత చదివామన్నది ముఖ్యంకాదు ఎంతటి పరిపక్వత  సాధించామన్నదే ముఖ్యం .ఎంత జ్ఞానాన్ని సంపాదించమన్నది ప్రధానం కాదు .ఎంత మేరకు తెలిసిన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్న మన్నదే ప్రధానం. పరిణత మది ప్రసరించదు పురాణాలు తిరిగేస్తేనే, పదునెక్కిన తపన లేక తుది లక్ష్యం అందేది ఎలా? ఎలా?                                          __ సినారె.

61 వ రోజు

ఒక పుస్తకమిచ్చిన  మనోవికాసం                                                   ఒక సారి నా మిత్రుడు పోలక్ ఒక పుస్తకం నాకిచ్చి "ఈ పుస్తకం చాలా బాగుంది. చదవండి. మీకు నచ్చుతుంది" అని అన్నారు.       పుస్తకం పేరు "అంటు ది లాస్ట్ ". రస్కిన్ రాసిన పుస్తకమది.       ఆ పుస్తకం చదవడం ప్రారంభించాను.చివరివరకు దాన్ని వదల లేకపోయాను. నన్ను ఆ పుస్తకం కట్టి వేసింది. జోహన్స్  బర్గ్  నుండి నేటాలుకు 24 గంటల ప్రయాణం.        సాయంత్రం రైలు డర్బను చేరుకుంది.         ఇంటికి చేరిన తరువాత ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. పుస్తకంలో చదివిన విషయాన్ని ఆచరణ లో పెట్టాలనే నిర్ణయానికి వచ్చాను.          ఇంతకు ముందు రస్మిన్ పుస్తకాలు ఏవీ నేను చదవలేదు. స్కూల్లో చదువుకునే రోజుల్లో పాఠ్య పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు నేను అసలు చదవలేదనే చెప్పవచ్చు. మన దేశంలోకి అడుగు పెట్టిన తరువాత సమయం ...

60 వ రోజు

మనిషిని అభిమానించగలం గానీ ద్వేషించే హక్కుమనకు లేదు నిన్నటి వరకూ ఎంతో ఇష్టపడిన మనిషిపై చిన్నదో, చితకదో కారణంతో అయిష్టం ఏర్పడుతుంది. అలా అయిష్టం మనసులో చోటుచేసుకున్న క్షణం మొదలు.. ఆ వ్యక్తీ, ఆ వ్యక్తితో ముడిపడిన ప్రతీ ఆలోచనా, ఆ వ్యక్తి హావభావాలు మొదలుకుని అభిప్రాయాలూ, మాటలూ, ఛేష్టల వరకూ ప్రతీదీ అపసవ్యమైనవిగానే, వికారంగానే కన్పిస్తుంటాయి. అవే ఆలోచనలనూ, అదే మనిషి చిరునవ్వునూ ఇన్నాళ్లూ మనం ఆస్వాదించాం. "ఎంత కల్లాకపటం లేని మనిషి మనకు జీవితంలో ఆత్మీయంగా దొరికారో కదా" అని మురిసిపోయాం. పదిచోట్లా ఆ మనిషి గురించి గర్వంగా చెప్పుకున్నాం. మరి ఆ చిరునవ్వులో ఈ క్షణం కుటిలత్వం గోచరిస్తోందంటే అది మన దృష్టిదోషమా.. లేక రాత్రికి రాత్రి ఆ మనిషిలో వచ్చిన అనూహ్యపు మార్పా?   మనుషుల్ని మనం దగ్గరకు తీసుకునేతనంలోనే మనం పరిణతిని కలిగి ఉండడం లేదు. ఒక వ్యక్తిలోని ఏదో ఒక్క పార్శ్యాన్నే చూసి మనం మనుషుల్ని అభిమానిస్తున్నాం, చేరువ అవుతున్నాం. మనకు నచ్చిన ఆ ఒక్క కోణంతో సరిపెట్టుకోకుండా మరింతగా ఆ వ్యక్తికి మనం దగ్గర అయ్యే కొద్దీ ఆ వ్యక్తిని నఖశిఖపర్యంతం గమనిస్తూ మనకు ఇంతకాలం ఆ మనిషిలో తెలియని కోణాలనూ గ్రహిస్తూ వ...

59 వ రోజు

30 రోజులపాటు ఇతరులను విమర్శించడం ఆపి వేయండి.జరిగే అద్భుతం గమనించండి. పొగుడండి. ఇతరులను పొగుడండి.  ఉత్తుత్తి గా కాదు.ఉన్న విషయాన్నే ప్రశంసించు.  ఒంటరిగా ఉన్నప్పుడు తెగుడు.  అందరి ముందు పొగుడు. పోగొడేందుకు ఎన్నడూ వెనుకాడదు. పొగడ్త  టానిక్ లాంటిది.  ఇతరులు నిన్ను పొగిడితే ఎలా ఉత్సాహం వస్తుందో ఇతరులను మీరు పొగిడినా వారికి అదే విధంగా ఉంటుంది.  పొగడటం లో పొదుపు ఉండరాదు. అతిశయోక్తి గా కాకుండా వాస్తవికంగా పొగడాలి.

58 వ రోజు

                   pc: fistp.com “ప్రతి మనిషికీ ఓ పేరు” ఉంటుంది. అది వ్యవహార నామం- గుర్తింపు కోసం, పిలవడం కోసం. అది సర్వసాధారణం. తల్లిదండ్రులు పెట్టిన ఆ పేరును నిలబెట్టుకోవడానికి కృషి చేయాలి. పేరు తెచ్చుకోవడమంటే కీర్తి సంపాదించడం, ప్రసిద్ధి పొందడం.  మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి మనిషికీ ఉంటుంది. ఆశించినంత మాత్రాన కీర్తి రాదు. ధర్మాచరణ, చిత్త శుద్ధి, సచ్ఛీలం వల్ల మంచి పేరు వస్తుంది. “మంచి మనసులేని అందం, వాసన లేని పువ్వు, క్రమశిక్షణ లేని చదువు, సదాశయం లేని యుద్ధం, ఆచరణలేని సూక్తులు, మనిషికి ఖ్యాతి తెచ్చి పెట్టలేవు' అంటారు. స్వామి వివేకానంద.  కోరుకుంటే, డబ్బు ఖర్చు పెడితే, పరులను స్తోత్రపాఠాలతో సంతోష పెడితే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రచారాలు చేసుకుంటే వచ్చే కీర్తి, అభినందన, స్తుతి అర్ధవంతమైనవి కావు. తన సాధన, కృషి, విజయం , దీక్ష, అధ్యయనం ఇతరులకు స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగిస్తే అది తప్పకుండా మనిషికి ఖ్యాతిని తెచ్చి పెడుతుంది. అది ప్రాచుర్యానికి, పదిమందికి చెప్పుకోవడానికి అర్హత కలిగినదే అవుతుంది....