Skip to main content

25 వ రోజు


              (pic source: medium)
విజయం సాధించాలి అనుకుంటే నువ్వు ఏం చేస్తున్నావో తెలిసి ఉండాలి. అలాగే నువ్వేం చేస్తున్నావో దాన్ని ప్రేమించాలి.ఇంకా నువ్వు చేస్తున్న పనిలో ఫలితం సాధించగలనన్న సంపూర్ణ విశ్వాసం ఉండాలి.
                             --- విల్ రోగర్స్

విజయం సాధించడానికి గుర్తుంచుకోవాల్సిన అంశాలు

1.లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. వాటిని పేపర్ పై  రాసుకోవాలి.

2. ఒకేసారి ఎక్కువ లక్ష్యాలను పూర్తి చేయాలని అనుకోరాదు.

3.ఒక లక్ష్యాన్ని పూర్తిగా ఏకాగ్రత గా ఉండి పూర్తి చేయాలి.

4.లక్ష్యం పూర్తవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి.ఆలోచన ముఖ్యమే గాని ఆలోచనను కార్యాచరణలోకి పెట్టకపోతే ఏం లాభం లేదు.

5.కార్యాచరణతో అన్నీ జరిగి పోవు. వైఫల్యాలు వస్తాయి. వైఫల్యాలే విజయానికి సోపానాలుగా భావించాలి.

6.క్రింద పడటం కాదు. పడిన ప్రతిసారి లేచి నిలబడాలి.

7.లక్ష్యాన్ని పూర్తి చేయడానికి గడువు పెట్టుకోవాలి.

8.లక్ష్యాన్ని చిన్నచిన ముక్కలుగా విడగొట్టాలి.
ప్రతి చిన్న లక్ష్యాన్ని పూర్తి చేయాలి.

9.చీటికి మాటికి లక్ష్యాన్ని మార్చుకోరాదు.
చేసే పని మీద నమ్మకం ఉండాలి.

10.మొహమాటం ఉండరాదు. దాన్ని వదిలి పెట్టాలి.

11.భయపడరాదు భయాన్ని వదిలి పెట్టాలి. భయపడుతూ మెల్ల మెల్లగా అడుగులు ముందుకు వేయడమే ధైర్యమంటే. 

12.పనిని ఇష్టంతో చేయాలి.ఆగిపోరాదు. నడక సాగిస్తూ ఉండాలి.

13.పట్టుదల ప్రధానమైనది. పట్టు పట్టరాదు,పట్టి విడువరాదు.

14.కాలాన్ని వృధా చేయరాదు.ప్రతి క్షణాన్ని పట్టుకోవడం నేర్చుకోవాలి.

15.వ్యామోహాలు,ఉద్వేగాలు బయటకు పంపేయాలి.

16.ఆత్మవిశ్వాసాన్ని ప్రతిరోజు పెంపొందించు కోవాలి. చెట్టు కు నీరు పోసి నట్లు రోజూ ఆత్మ విశ్వాసం పెంచుకోవడానికి పుస్తకాన్ని కనీసం పది నిమిషాలు చదవాలి.

17.ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజూ వ్యాయామం చేయాలి.

18.ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి
ఇతరులతో వాదన పెట్టుకోరాదు.

19.ఇతరుల సహకారాన్ని కోరాలి. గెలవడం ఎంతో ముఖ్యం.

Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.