Skip to main content

20వ రోజు


భావవ్యక్తీకరణ


మన్రోబియన్ అనే పరిశోధకుని ప్రకారం ఎదుటి వ్యక్తిపై మన ప్రభావం మనం చూపే భావవ్యక్తీకరణ పై  ఆధారపడి ఉంటుంది.
 
 55% మన మన శరీర భంగిమ ద్వారా 
 38% మన గొంతులో చూపేస్తాయీ మార్పుల ద్వారా 
  7% కేవలం మాట్లాడే పదాల ద్వారా
 మన ప్రభావం ఎదుటి వ్యక్తిపై ఉంటుందట. 
 అంటే మన శరీర భంగిమ ప్రధానమని   తేటతెల్లమైంది.

భావ వ్యక్తీకరణ నైపుణ్యం మెరుగుపరుచు కోవడానికి కింది సూచనలు ఉపయోగపడతాయి.

*   ఇతరులతో మీ ప్రవర్తన ఎలా ఉందనే విషయాన్ని గుర్తెరిగి ఉండటం అవసరం.(ఎరుక)


*   మీ ప్రవర్తనకు మీరే బాధ్యత వహించగలగాలి. పొరపాట్లకు బాధ్యత వహించడానికి వెనుకాడకూడదు. ఇతరులతో మీ ప్రవర్తన ఎలా ఉన్నదనే విషయం వారిని అడిగి తెలుసుకోవడం ఉపయోగకరం.(బాధ్యత)


*   ఇతరులతో వ్యవహరించేటపుడు హావభావాలకు చాలా ప్రాముఖ్యం ఇవ్వాలి. మాటలూ చేతలూ ఒకదానితో ఒకటి ఏకీభవించకపోతే సాంఘిక వాతావరణంలో ఇబ్బందులు ఎదురవుతాయి.(హావభావాలు)


*   భావ వ్యక్తీకరణ నైపుణ్యం పెంచుకోవడానికి ఉత్తమ మార్గం- శ్రద్ధగా వినడం! అవతలి వ్యక్తి చెప్పే విషయం మీద మధ్యలోనే స్పందించే తత్వానికి స్వస్తి చెప్పాలి. ఏకాగ్రతతో విని, విషయం అర్థం చేసుకోవాలి. మధ్యలోనే సలహాలూ, సూచనలూ ఇవ్వడానికీ, విమర్శలు రేపడానికీ ప్రయత్నించకూడదు.(శ్రద్ధగా వినడం)


*   ఈ నైపుణ్యం పెంచుకోవడం ఒకరోజులో సాధ్యమయ్యే పని కాదు. అనేక విషయాల మీద ఒకేసారి దృష్టి పెట్టడం కంటే ఒక నిర్దేశిత సమయంలో రెండు మూడు విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు వ్యక్తిగతంగా మీకున్న శక్తియుక్తుల సాయంతో సానుకూల ఫలితాలు సాధించాలి.(దృష్టిి)


*   ఇతరులతో మీ ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ, పరిశీలించుకుంటూ ఉండాలి. మీ ప్రతికూల ప్రవర్తనకు బాధ్యత వహించడం, ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడం, సమస్యలను పరిష్కరించడం నేర్చుకోవడం, హావభావాలను మెరుగుపరుచుకోవడం... ఇవన్నీ ఎంతో ఉపయోగకరం.

Comments

  1. విద్యార్థి దశలో,ఉద్యోగుల ప్రిబేషనరీ పీరియడ్ లో,
    శిక్షణా కేంద్రాలు లో తప్పక ఈ పై విషయాలు పై అవగాహన కల్పించాలి.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.