Skip to main content

Posts

Showing posts from June, 2020

4 వ రోజు

ఈ అలవాట్లు పెంచుకొని చూడండి. 1. నెలకో మంచి పుస్తకం చదవటం పూర్తి చేయాలి. 2. ఒక మెంటార్ ను గుర్తించాలి నెలకోసారి వారి దగ్గర సలహా తీసుకోవాలి. 3. మీ లక్ష్యాలు మీ కలలు మీ ఐడియాలతో జనరల్ రాయాలి. 4. శారీరక వ్యాయామం కనీసం అరగంట చేయాలి 5. రోజూ మానసిక వ్యాయామం కొరకు  కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు సానుకూల ఆలోచనలు చేయాలి. ఈ పనులన్నీ వరుసగా 21 రోజులు చేయాలి ఆ తర్వాత అవి అలవాటవుతాయి.

3 వ రోజు

ఆనందం కోసం పది  సూత్రాలు 1. ఏదో ఒక పనిలో నిమగ్నమై చురుగ్గా ఉండాలి. 2. గందరగోళం లేకుండా ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని గడపాలి. 3. ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. 4. చిన్న చిన్న విషయాలపై అనవసర ఆందోళన పడరాదు. 5. వినోదం కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. 6 ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉండాలి. 7. పుచ్చుకునే దానికన్నా ఎక్కువగా ఇచ్చేదాన్ని అలవాటు చేసుకోవాలి.(దాన గుణం అభివృద్ధి చేసుకోవాలి) 8. వర్తమానంలో జీవించాలి. గతం గతః అనుకోవాలి. 9. రోజూ చిన్న చిన్న లక్ష్యాలు నిర్ణయించుకొని  వాటిని పూర్తి చేస్తూ ఉండాలి. 10. సానుకూల దృక్పథాన్ని అలవర్చు కోవాలి.

2వ రోజు

ఆత్మ సౌందర్యం తో ఇతరులను ఆకట్టుకోవాలి. చర్చ విజ్ఞానానికి మూలం. వాదన అజ్ఞానాన్ని కి పరాకాష్ట. వాదన కేవలం కాలహరణకు అభిప్రాయ భేదాలకు దారితీస్తుంది. మీరు ఏ వ్యక్తితో పనిచేస్తున్నారో, అతన్తో వాదులాటకు దిగరాదు. ఒక చిన్న వాదన మరెన్నో కోల్పోయినట్లు చేస్తుంది. సంయమనంతో వ్యవహరించండి. వాదనల వల్ల ఎప్పుడూ విజయం రాదు. మీరు వాదనలో ఎంత ఎక్కువ నెగ్గితే అంత తక్కువ స్నేహితులు ఉంటారు.

1వ రోజు

            మీరు జీవించడంలో కీలకమైన విషయం  ఏమంటే  మీ జీవితానికి ఒక లక్ష్యాన్ని కనుక్కోవడం.దాని పైనే మీ మనస్సు ను,బుద్ధిని లగ్నం చేసి ఆ లక్ష్యాన్ని చేరడమేనన్నాడు గౌతమ బుద్దుడు.  మధ్యలో తన లక్ష్యాన్ని మరచి దారితప్పరాదన్నాడు. అలాగే  ఒక లక్ష్యాన్ని చేరుకున్నాక మరొక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. జీవితమంటే లక్ష్యాల చేధనే. లక్ష్యాన్ని చేరుకోవడానికి తగినంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దీనికి సంబంధిత పుస్తకాలను చదవాలి.గురువుల సలహాలను పొందాలి. ఆ రంగంలో విజయం పొందినవారి జ్ఞానాన్ని గ్రహించాలి. ఎంత చదివామన్నది ముఖ్యం కాదు.ఎంత పరిణతి సాధించామన్నదే ముఖ్యం. ఎంత జ్ఞానం సంపాదించామన్నది ప్రధానం కాదు. ఎంత మేరకు తగిన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నా మనదే ప్రధానం. అందుకే సినారె అంటాడిలా.       "పరిణతమది ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే        పదునెక్కిన తపన లేక తుది లక్ష్యం అందేదెలా?"                                        ____ pillaa ...