పదో రోజు
నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి మార్గాలు
1. ప్రగతి సాధిస్తున్న వ్యక్తి బాగా పొగడాలి.
ప్రోత్సహించాలి. ఇదేనా నీ ప్రగతి అని ఎద్దేవా చేయరాదు.
2.తన అవసరాలనే కాదు తన టీమ్ అవసరాలను గుర్తించే వాడే నిజమైన నాయకుడు.
3. ద్వేషం భయం నేర మనస్తత్వం ఉండరాదు. ఇవి ప్రమాదకర శత్రువులు.
4.వ్యాపారంలో మూడు ముఖ్యమైన విషయాలు అవసరం అవి 1. ధైర్యం 2.ధైర్యం 3.ధైర్యం
5. ఉత్సాహం ఎన్నో అద్భుతాలు చేస్తుంది. అది బద్ధకాన్ని వదిలిపెడుతుంది.నాయకుడెపుడూ ఉత్సాహంగా ఉండాలి.
6.ఇతరులను మార్చాలంటే ముందు మీరు మారాల్సి ఉంటుంది మీరు మారి ఆచరిస్తే ఇతరులు మిమ్మల్ని అనుసరిస్తారు.
7.మీరు చేస్తున్న పని వల్ల అనుకున్న ఫలితం రాకపోతే పాత పద్ధతిని వదిలిపెట్టి కొత్త పద్ధతిని ప్రయత్నించాలి.
8.నాయకునికి తప్పనిసరిగా లక్ష్యం ఉండాలి. లక్ష్యం సాధించాలనే పట్టుదల ఉండాలి.
9.ఎంత ఒత్తిడి ఉన్నా హుందాగా ప్రవర్తించాలి. ఒత్తిడితో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించడం నిజమైన నాయకత్వ లక్షణం
__జోసఫ్ కెన్నెడీ.
Comments
Post a Comment