6వ రోజు
1.మన నమ్మకమే మన సామర్థ్యం
కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు బి లీఫ్
2. నమ్మకం మనిషిని చేస్తుంది లేదా నేలకు పడేటట్లు చేస్తుంది
3. వేయి దేవుళ్ళ మీద నమ్మకం ఉన్నా నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీ జీవితంలో నీవు ముందుకి వెళ్ళలేవు అనన్నాడు వివేకానందుడు.
4.నిన్ను నీవు నమ్మితే నీ శక్తులన్నీ నీ ఎంపికలోనే ఏకీకృతం చేస్తావు
5.నీ వెనుక నీవు నిలబడిన వాడు నీ విజయావకాశాలు ఒకటికి పదింతలవుతాయి
-- చెర్రీ కార్టర్ స్కాట్
6.నేను ఇది చేయగలను అని దృఢంగా అనుకున్నప్పుడు నీ మెదడు దాన్ని ఎలా సాధించాలో ఆలోచిస్తుంది.
7.నిజజీవితంలో ప్రతి పెద్ద వ్యాపారం నమ్మకం అనే మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది.
8.పెరుగుదల అనేది పిరమిడ్ లాంటిది దాని మీద నిలబడడానికి చోటు ఉండదనే నమ్మకం మనిషిని పైకి ఎదగనివ్వదు.
9.అనుమానం ఉన్న వాడు బలహీనుడు. బలమైన గట్టి నమ్మకం ఉంటాయి గొప్ప గొప్ప పనుల వెనక.
--జె ఎఫ్ క్లర్క్
10. మీ కలను నిజం చేసుకోగలమని నమ్మితే మీ అంతరంగం ఖచ్చితంగా ఆ కల పట్ల కమిట్మెంట్ ను ఏర్పరచుకుంటుంది.
11.తమ కలల గొప్పతనాన్ని గ్రహించి వాటిని నమ్మ కలిగిన వ్యక్తులకే భవిత స్వాగతం పలుకుతుంది
----గేథే
12.దేన్నైనా నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతావు దానిని సాధించి తీరుతాం
13.నమ్మకమైన విశ్వాసాన్ని మించిన శక్తి ఏదీ లేదు
భవిష్యత్తు మనదే అన్న నమ్మకంతో
జీవించాలి.
Comments
Post a Comment