pc: dishadaily.com మనిషి తనలోని శక్తిని పూర్తిగా వినియోగించుకుంటే అద్భుతాలను సృష్టించగలడు. ఆనందంగా నూరేళ్లు జీవించే నైపుణ్యాలు జీవన వికాసానికి తోడ్పడతాయి. చీకటినుంచి వెలుగులోకి ప్రయాణించడమే అద్భుత జీవనం అంటే. ఎవరూ పుట్టుకతోనే ప్రతిభా సంపన్నులు కారు. అనుభవాలు పెరిగేకొద్దీ మానసిక పరిణతి, వివేకం, విచక్షణాజ్ఞానం వెన్నంటి వస్తాయి. అణువులో బ్రహ్మాండాన్ని చూడటమే అద్భుతం.సంకల్పశక్తి, విశ్లేషణాశక్తి, సాధనాశక్తి- ఈ త్రిశక్తిధారణమే అద్భుతాలను సృష్టిస్తుంది. అద్భుతాలను సృష్టించేందుకు మాయలు, మంత్రాలు లేవు. కళ్లు మూసుకు కూర్చున్నంత మాత్రాన అద్భుతాలు జరిగిపోవు. కార్యరంగంలోకి యోధులై కదలనిదే అద్భుతాలు ఆవిష్కృతం కావు. జీవన గమనంలో కష్టనష్టాలను మౌనంగా, గంభీరంగా భరించడం, ఓటమిని హుందాగా స్వీకరించడం, అవమాన భారాలను సహించడం, కన్నీరు ఉబికి వస్తున్నా చిరునవ్వులు చిందించే మనోస్థైర్యాన్ని చూపడం- కోపతాపాలను జయించడం, కష్టమని తెలిసినా ప్రయత్నమే విజయానికి నాంది అంటూ సంకల్ప సిద్ధులు కావడం వంటివి ధీరగంభీరమైన వ్యక్తిత్వానికి నిదర్శనాలు. అవి జీవితాన్ని పండించే అద్భ...