విజయ శిఖరాలను అందుకున్న వారు వాటిని యాదృచ్చికంగా అందుకోలేదు వారి సహచరులు సుఖనిద్ర లో ఉండగా వీళ్ళు అంతర్మథనంలో అహరహం శ్రమించారు
___లాంగ్ ఫెలో
ఇతరులు చేయడానికి ఇష్టపడని పనులను కూడా విజేతలు చేస్తారు. ఎప్పుడు వాయిదా వేస్తూ ఉండే పనులు చేపడతారు.
అరుణిమ సిన్హా(2013,lag amputee), ఎరిక్ వెయిన్ మేయర్(2001, blind) వీరు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. వారి ప్రత్యేకత ఏమంటే వారంతా వికలాంగులు కావడం. ఎవరెస్టు శిఖరం మానవుని సంకల్ప బలానికి మరోమారు శిరసు వంచి నమస్కరించింది.
గుండె, సూర్యుడు, భూమి ఇవి ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి. ఇవి వాయిదాకు వ్యతిరేకం. వాయిదా తత్వం మీ అభివృద్ధికి ఆటంకం. ఈరోజు అనుకొన్న పనిని ఆరోజే పూర్తి చేయాలి. చేయాల్సిన పనులు కాగితంపై రాసుకొని వాటిని సాయంత్రం లోపు పూర్తి చేయాలి.
Nice motivation sir
ReplyDelete