Skip to main content

Posts

Showing posts from February, 2021

54 వ రోజు

       pic courtesy tnilive.com        బద్ధకం  మనిషిని ముందుకు పోనీకుండా చేస్తుంది. ఏ పనీ చేయకుండా ఆపేస్తుంది. బద్ధకం మనకు శత్రువు. బద్ధకాన్ని వదిలించుకోవాలి.          బద్దకాన్ని వదిలించుకోవడానికి ఏం చేయాలంటే ఏ పనిని  మనం వాయిదా వేస్తున్నామో ఆ పనిని  చేయడమే.        రేపటికి వాయిదా వేయడం బద్దకానికి చిహ్నం చేయకుండా ఉన్న పనిని ప్రారంభించడమే బద్దకాన్ని వదిలించుకోవడానికి గుర్తు.       ఈ రోజే వదిలి పెట్టిన పనిని‌ చేయండి.

55 వ రోజు

సృజనాత్మకత  పెంచుకోవాలి.అంతకు ముందు తెలిసిన జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని జోడిస్తే వచ్చే కొత్త ఐడియా నే సృజనాత్మకత అంటారు. కేవలం శ్రమను నమ్మిన వాళ్లు కోటీశ్వరులవ్వడం దశాబ్దాలు పడుతుంటే సృజనాత్మకతను నమ్మిన వాళ్ళు కొద్ది నెలల్లో అంతకుమించి విజయాలు సాధిస్తున్నారు.        సృజనాత్మకత ఉంటే తక్కువ సమయం లో అతి ఎక్కువ శ్రమతో గుర్తింపు పొందుతారు. భిన్నంగా ఆలోచించడం,పజిల్స్ చేయడం, కొత్త వ్యక్తులతో నిపుణులతో చర్చించడం, హాజరు కావడం వంటివి చేయడం ద్వారా సృజనాత్మకతను పెంచుకోవచ్చు.

64 వ రోజు

  pc raconteur.net        నువ్వు ఎంత ఎదిగిపోయావు జీవితంలో ఎంత సంపాదించావు అన్నవి విజయానికి కొలమానాలు కావు. జీవితంలో ఎన్ని సార్లు కింద పడిన మళ్ళీ ఎన్నిసార్లు లేచి నిలబడ్డావన్న దాన్ని బట్టే ఈ విషయాన్ని గుర్తిస్తారు.       వైఫల్యాలు ఎదురవగానే లక్ష్యం  పట్ల క్రేజీ వదిలిపోయి వదిలేస్తారు. ఫెయిల్యూర్ మనకు అనేక పాఠాలు నేర్పిస్తుంది. అయితే ఎదురుగా ఉన్న లక్ష్యం పెద్ద కొండ లాగా కనిపిస్తుంది ఇక్కడ సహజంగా చాలామంది చేస్తారు పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించాలి అనుకున్న చిన్న చిన్న పనులు దగ్గర చిన్న చిన్న వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగిపోవాలి దాని వాస్తవిక దృష్టి లేకపోవడం అంటారు వాస్తవిక దృష్టి మనవాళ్ళు వ్యవహరిస్తారు అంతర్గత శక్తులను వెలికి తీసి చేయడానికి దోహదపడుతుంది విజేతలు ఆటంకాలను వాడుకుంటారు ఎన్నటికీ పసివాడిని సమకూర్చాడు పేదవాడైన అమెరికా అధ్యక్షుడు అయ్యాడు ఒక పనిలో మనం దెబ్బతింటే జీవితమంతా దెబ్బతిన్నట్లు కాదు

56 వ రోజు

       ప్రస్తుతం  సమాచార విప్లవ ప్రపంచంలో ఉన్నాం. వద్దన్నా సమాచారం మనకు అందుతుంది. మనకు కావలసిన సమాచారాన్ని మనం తీసుకోవాలి. తక్కిన దానికి దూరంగా ఉండాలి. లేకపోతే మనం సమయం ఆ సమాచారం తినేస్తుంది.        సమయపాలన ప్రణాళికాబద్ధ జీవితానికి తోడ్పడుతుంది. సమయాన్ని హరించే అలవాటును దూరం చేసుకోవాలి. మనం చేసే పనులను లక్ష్యానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు గుర్తించాలి. ప్రతి పనికీ చివరి గడువును పెట్టుకోవాలి. అవి మనం చేయాల్సిన పనుల సాధనలో కీలకంగా పనిచేస్తాయి‌

57 వ రోజు

సరైనదేదో తెలుసి కూడా చేయకపోవడం అధైర్యానికి  చిహ్నం.                                      ____కన్ఫ్యూషియస్         మీ జీవితానికి మీరు బాధ్యత వహించడం విజయానికి చాలా ప్రధానం.       మీ జీవితానికి బాధ్యత మీదే. ఇంకెవరూ కారు.      నేను వంచింపబడ్డాను. బలి పశువు నయ్యాను అని  భావించవద్దు. దాని వల్ల ఉపయోగం లేదు       చిన్న తనం లో వంచింపబడితే గతం నుంచి బయట పడాలి. అదొక పీడకల అనుకోవాలి.        మీ జీవితంలో మీ పాత్ర ఏమిటి? మీరే అర్థం చేసుకోవాలి. మీ జీవితంపై మీ అదుపులో ఉన్నప్పుడు మీరు విజయం వైపు సాగుతారు.

53 వ రోజు

      pic courtesy: light of mind.com         మెంటల్ ప్లే టెక్నిక్ - విజువలైజేషన్           మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మన మెదడులో కొన్ని క్షణాలు మాత్రమే ఉత్తేజం చెందుతాయి మనం చేయాలనుకున్న పనిని మనసులో ఒక సినిమా రీలులాగా ఊహించుకుంటూ ఆయా సంఘటనల శబ్దాలను వింటూ , స్పర్శను సైతం అనుభవంలోకి తెచ్చుకుంటేమన మెదడులో మన కోరిక బలమైన ముద్ర వేసుకుంటుంది. ఈ విధంగా మనం  మంచి అలవాట్లను పెంచుకోవచ్చు. సాధించాల్సిన లక్ష్యాలను ఈ విధంగా ఊహించుకోవడం వల్ల అవి మన అణువణువులో ఉత్తేజాన్ని నింపి మెదడు ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన మార్గాలను మనకు సూచిస్తుంది.ఆ సూచనలను అమలు చేయాల్సి ఉంటుంది.        వీటిని అనేకసార్లు మెంటల్ ప్లే చేయాల్సి ఉంటుంది.

52 వ రోజు

మనిషి ఒక్కడే తన లోపాన్ని అధిగమించేందుకు శక్తి కలవాడు                            __ఆల్ఫ్రెడ్ ఆడ్లర్      బలహీనతను నిజాయితీగా ఆమోదించాలి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనమెన్నో ప్రయత్నాలు చేస్తాం. ఇది సరైనది కాదు.      బలహీనతను జయించడం అంటే ప్రపంచాన్ని జయించడం తో సమానం.      హెలెన్ కిల్లర్ కు గుడ్డి,చెవుడు వచ్చింది చిన్న తనంలో నే. కానీ గొప్ప వ్యక్తిగా మారింది.  ఎడిషన్కు చెవుడు.అయినా గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశాడు.   రూజ్వెల్ట్ కు పోలియో. ఆయన  అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు.  నెపోలియన్ పొట్టివాడు అయినప్పటికీ జనరల్ అయ్యాడు.  జర్మనీలో బోర్డర్ కొయ్య కాళ్ళు ఉండేవి ఆయన పైలెట్ అయ్యాడు.       బలహీనతలను చూస్తూ కూర్చోకుండా అధిగమించడమే మనం చేయాల్సింది.

63 వ రోజు

      pc enaadu.net మార్పు లేకపోతే గమ్యం చేరుకోవడానికి కొంత దూరం కూడా ప్రయాణం చేయలేం  విజేతలు ఎప్పుడూ మార్పును ఆహ్వానిస్తారు  మార్పు చెందడానికి రోజూ సానుకూలపు మాటలు మాట్లాడండి  పాజిటివ్ గా మాట్లాడటం మొదలుపెడితే దారి చక్కగా కనిపిస్తుంది  చిన్న మార్పులు అతి పెద్ద మార్పుకు దోహదం చేస్తాయి  ఏదీ సులభంగా దొరకదు. దాని కోసం మనం పరిగెత్తక పోతే.

41 వ రోజు

The person who stopped your growth One day all the employees reached the office and saw a big advice written on the door. "Yesterday the person who has been stopping your growth in this company passed away. You are invited to join the funeral." In the beginning, they got sad for the death of one of their colleagues, but after a while they got curious to know who was the man who stopped their growth. Everyone thought: 'Well at least the man who stopped my progress died!' One by one the thrilled employees got closer to the coffin, and when they looked inside they were speechless. They stood shocked in silence, as if someone had touched the deepest part of their soul. There was a mirror inside the coffin and everyone who looked inside could see him/herself.  There was a sign next to the mirror that read: "There is only one person who is capable to set limits to your growth...It is you. You are the only person who can influence your happiness, success and realization...

51 వ రోజు

          Failure is a best teacher "Success is a lousy teacher. Failure teaches you more." There was a very brilliant boy, he always scored 100% in Science. Got Selected for IIT Madras and scored excellent in IIT. Went to the University of California for MBA. Got a high paying job in America and settled there. Married a Beautiful Girl. Bought a 5 room big house and luxury cars. He had everything that make him successful but a few years ago he committed suicide after shooting his wife and children. WHAT WENT WRONG? California Institute of Clinical Psychology Studied his case and found “what went wrong?” The researcher met the boy's friends and family and found that he lost his job due to America’s economic crisis and he had to sit without a job for a long time.  After even reducing his previous salary amount, he didn't get any job.  Then his house installment broke and he and his family lost the home.  They survived a few months with less money an...

50 వ రోజు

విజేతలెవరూ జీవితం నుంచి పారిపోరు. ఓటమిని ఓ పట్టాన అంగీకరించరు. ఫ్రెంచి విప్లవంపై తాను అద్భుతంగా రూపొందించిన రాతప్రతి తన కంటి ఎదుటే అగ్నికి ఆహుతి కావడంతో థామస్‌ కార్లయిల్‌ అనే గొప్ప రచయిత దిగ్భ్రాంతికి లోనయ్యాడు.  మానసికంగా కుంగిపోయాడు. పిచ్చివాడిలా తిరుగుతుంటే ఒక రోజు ఇటుక ఇటుకగా శ్రద్ధగా గోడను నిర్మిస్తున్న తాపీ మేస్త్రీ కనిపించాడు. ఏదో మెరుపు మెరిసినట్లు కార్లయిల్‌లో ఆశావాదం మొలకెత్తింది. తాపీ మేస్త్రీ పనితీరు స్ఫూర్తిగా రోజుకో పేజీ రాయాలన్న ఆలోచన తోచింది. తిరిగి రచన మొదలుపెట్టాడు. అది మొదటిదానికన్నా అద్భుతంగా రూపొందడం చూసి తానే ఆశ్చర్యపోయాడు. రెట్టించిన ఉత్సాహంతో ఆ బృహత్తర గ్రంథాన్ని పూర్తిచేశాడు. ‘వీరులు, వీరపూజ (హీరోస్‌ అండ్‌ హీరో వర్షిప్‌)’ పేరుతో విడుదలైన ఆ పుస్తకం ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. కార్లయిల్‌కు అంతులేని కీర్తిని తెచ్చిపెట్టింది. విజేతలెవరూ జీవితం నుంచి పారిపోరు. ఓటమిని ఓ పట్టాన అంగీకరించరు.  మాట్లాడటం సరిగ్గా రాదని బాల్యంలో హేళనకు గురైన విన్‌స్టన్‌ చర్చిల్‌ పట్టుదలతో ప్రసంగ కళను సాధన చేశాడు. ప్రపంచం చెవులొగ్గి వినే గొప్ప వక్తగా పేరు గడించాడు. పొట్టివాడివి, సిన...

49 వ రోజు

జీవితమంటే... జీవితమంటే అర్థమేమిటని తన గురువును ప్రశ్నించాడో శిష్యుడు.  ‘జీవితమనే పదానికి నిఘంటుపరంగా జీవనమని అర్థం.'  జీవితాన్ని జీవించడం ద్వారా దానికొక ప్రయోజనం, విలువను ఇవ్వగలిగితే అది ఓ అర్థాన్ని సంతరించుకుంటుంది.  జీవితానికొక సార్థకతను, ఉదాత్తతను చేకూర్చాలి.  అలా చేయడానికి మనకొక అవకాశంగా జీవితం వచ్చిందని భావించాలి.  'మన జీవన విధానమే మన జీవితాన్ని అర్థవంతం చేసుకుంటున్నామో లేదో నిర్ణయించేది’ అని నిర్వచించాడా గురువు.

48 వ రోజు

(pic source: dreamstime.com) ఈ 6 అల‌వాట్లు మీ జీవితాన్నే మారుస్తాయి. హాల్ ఎలోర్డ్   అనే ప్ర‌ముఖ ర‌చ‌యిత రాసిన.   “ద మిరాకిల్ మార్నింగ్” గ్రంథం లో ఉద‌యం 8 లోపు చేసే 6 ప‌నులు మ‌న జీవితాన్నే మారుస్తాయని చాలా స్ఫ‌ష్టంగా చెప్పాడు.  6 అంశాల ప్రణాళిక. S.A.V.E.R.S S-Silence( నిశ్శ‌బ్దం)      మ‌న ప్ర‌తి రోజును చాలా నిశ్శ‌బ్దంగా ప్రారంభించాలి…అంటే ప్ర‌శాంత‌త‌తో స్టార్ట్ చేయాలి..లేవ‌డం లేట‌య్యింది…అయ్యే ఎలా…? ఆఫీస్ ప‌ని…ఈ రోజు అత‌డిని క‌లుస్తాన‌ని చెప్పాను…ఎమోయ్…టిఫిన్ అయ్యిందా…..ఇదిగో ఇంత‌లా హైరానా ప‌డొద్దు… ప్ర‌శాంతంగా లేవ‌గానే….కాసింత సేపు మెడిటేష‌న్ చేయండి. లేదా…క‌ళ్ళు మూసుకొని ప్ర‌శాంత‌త‌ను మీ మ‌న‌స్సులోకి ఆహ్వానించండి. ఇక్క‌డే మ‌న రోజు ఎలా గ‌డుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది . A-Affirmations ( నీతో నువ్వు మాట్లాడుకోవ‌డం)  అంద‌రి గురించి, అన్ని విష‌యాల గురించి అన‌ర్గ‌లంగా మాట్లాడే మ‌నం…మ‌న‌తో మ‌నం ఒక్క‌సారి కూడా మాట్లాడుకోలేక‌పోతున్నాం. అస‌లు మ‌న‌లోని మ‌న‌కు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళ‌ల్లో ఖ‌చ్చితంగా ఈ ల‌క్ష‌ణం ఉంటుంది. ఈ మ...

47వ రోజు

        pic courtesy:  Getty images  ఎవరికైనా ఆరోగ్యానికి మించిన సంపద లేదు ఈ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. అవేమంటే శారీరక ఆరోగ్యం :          మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకుని రోజూ వ్యాయామం చేయాలి. దేహమే దేవాలయం ,ఆహారమే ఔషధం. ఈ సూత్రాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మానసిక ఆరోగ్యం:            మంచి పుస్తకాలను రోజూ చదువుతూ ఉండాలి. ఉన్నత వ్యక్తిత్వం గల వారిని కలుస్తూ వారి పరిచయాలను పెంచుకోవాలి. మంచి మిత్రుల స్నేహం చేస్తూ ఉండాలి. మానసిక కాలుష్యం కాలకూట విషం కన్నా ప్రమాదకరమైనది. ఉద్వేగ ఆరోగ్యం:            వివిధ భావాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. స్వీకరించిన భావాలను వ్యక్తీకరించాలి. రోజూ ఎదురయ్యే అనేక ఉద్వేగాలను తట్టుకుని నిలబడగలగడం చాలా ముఖ్యం ఇదే ఉద్వేగ ఆరోగ్యానికి చిహ్నం.                                           ...

46 వ రోజు

        pic courtesy: intelligence mantra. మంచి ఎక్కడ వున్నా పరిగ్రహించు. చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు. మేలు చేయక పోయిన పరవాలేదు. ఎవరికి కీడు మాత్రం చేయకూడదు. ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంతా గొప్పగా కనిపించేలా జీవించు. ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టాలెదురైనా నువ్వు ఆత్మవిశ్వాసం కోల్పోకు.

45వ రోజు

నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతుంది. మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది. మనం పక్షుల్లా గాలిలో ఎగరడం, చేపల్లా నీటిలో ఈదడం నేర్చుకున్నాము. కానీ భూమిపై మనుషుల్లా ఎలా జీవించాలో మనకు తెలియడం లేదు .   జీవితంతో పోరాడే క్రమంలోనే మానవత్వం ఉన్న మనిషిలా మారుతాము.

44 వ రోజు

          courtesy: telugu7.com         మనిషి దీపమైనా కావాలి. అద్దమైనా కావాలి. ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి ప్రతిబింభిస్తుంది. ప్రతి వారు దీపం కాకపోవచ్చు, కాని అద్దం కాగలరు.         తన ఆచరణ ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని పంచడమే జీవితం.

42 వ రోజు

            కలిసి పాడుదాం తెలుగు పాట నలుగురితో కలిసి పాడితే మానసిక ఉల్లాసం       నలుగురితో కలిసి పాటలు పాడే అవకాశం ఎప్పుడైనా వస్తే అస్సలు వదులుకోకూడదని సూచిస్తున్నారు బ్రిటన్లోని ఈస్ట్ ఆంగ్లియా విశ్వ విద్యాలయ పరిశోధకులు. బృందంలో భాగంగా చేసే గీతాలాపనలు మానసిక ఉల్లాసాన్ని చేకూరుస్తాయని వారు వెల్లడించారు. మానసిక అనారోగ్య సమ స్యల నుంచి బయటపడేందుకు అవి దోహదపడుతాయని పేర్కొన్నారు.        ప్రతి వారం పాటల కార్యశాలలు నిర్వహించే సింగ్ యువర్ హార్ట్ ఔట్(ఎస్పీ హెవో)' కార్యక్రమాల్లో పాలుపంచుకున్న వారిపై ఆర్నెళ్లపాటు పరిశోధనలు జరిపి ఈ అంశాన్ని నిర్ధారించినట్లు తెలిపారు.

43 వ రోజు

             courtesy: pinterest ప్రతికూల ఆలోచనలను త్యజిస్తేనే శరీరానికి మెరుగులు  నూతన సంవత్సరం ప్రారంభమవుతోందంటే చాలు. బరువుతగ్గాలని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అవన్నీ బాగా పనిచేయాలంటే తొలుత ప్రతి ఒక్కరూ తమ శరీరంపై సానుకూల ఆలోచనలతో ఉండాలని సూచిస్తున్నారు అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ విశ్వవిద్యాలయ పరిశోధకులు.  పొట్ట ఉందని.. శరీరాకృతి బాగాలేదని ఏవేవో ప్రతికూల ఆలోచనలతో ఉంటే పరిస్థితులు మెరుగ య్యేందుకు ఎన్ని తీర్మానాలు చేసుకున్నా నిప్క్రయోజనంగానే మిగిలిపోతాయని వారు చెప్పారు. ఎవరైనా శరీరాకృతిలో మార్పులు చేసుకోవాలంటే తొలుత వారు తమ దేహంలోని సానుకూల అంశాలను పదేపదే గుర్తు చేసుకోవాలని సూచించారు. ఫలితంగా సానుకూల దృక్పథం పెరిగి, శరీరం మరింత మెరుగ య్యేందుకు అవసరమైన పనులు చేసేలా పురిగొల్పుతుందని వివరించారు

40 వ రోజు

          pic source India.com ఉపన్యాసం చేసే వారికి కాస్త నటన కూడా తెలిసి ఉండాలి.  అవసరమైతే ఆవేశం ప్రదర్శించాలి.హాస్యం ప్రదర్శించాలి.  అవసరమైనప్పుడు కరుణ చూపించాలి.  అవకాశం ఉన్న చోట చూపించాలి

39 వ రోజు

          (pic source sites.google.com) మీరే రోల్ మోడల్ కండి. జీవితంలో మీకు నచ్చిన రంగంలో అభివృద్ధి సాధించిన పేరుగడించిన వ్యక్తిని రోల్ మొదట రోల్ మోడల్ గా తీసుకోండి.   మీకు నచ్చిన రంగానికి సంబంధించిన గుణగణాలను రోజు అభివృద్ధి చేసుకోవాలి. శిక్షణ పొందాలి.   మీరే ఒక రోల్ మోడల్ అవుతారు. మీ లక్ష్యాన్ని చేరడానికి ఈరోజు మీ అడుగులు పడుతున్నాయో లేదో పరిశీలించుకోవాలి. Role Model? I don’t have one…. I want to become one!!

38 వ రోజు

          pic source kefi.com చీకటి తగినంత దట్టంగా ఏర్పడినప్పుడే నీకు నక్షత్రాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి                                   __చార్లెస్ బియర్డ్ కోపం మిమ్మల్ని దహించివేస్తుంది. కోపాన్ని మనం ప్రేమించే వారిపై చూపించరాదు. కోపాన్ని చూపించాల్సింది మీ లక్ష్యం మీద, మీ అసహ్యకర పద్ధతుల మీద.        కోపాన్ని ప్రదర్శించటం అంటే మీ చేతిలో నిప్పు  పెట్టుకుని ఇతరులపై విసరటం లాంటిదని చెపుతాడు బుద్ధుడు. కోపం తగ్గిపోయాక మీ మనస్సు ఎంతగానో గాయపడుతుంది.  ఎదుటి వారితో సంబంధాలు దెబ్బతింటాయి. మిమ్మల్ని ప్రేమించే వారు మీకు దూరం అవుతారు.  కోపాన్ని నిగ్రహించుకోవడానికి మీ ఆహారం మీ ఆరోగ్యం తోడ్పడుతాయి. సాత్వికాహారం తీసుకోవాలి.  అల్సర్ తో కడుపులో పుండ్లు లేకుండా చూసుకోవాలి.  ఎక్కువగా నీళ్లు తాగాలి.  ప్రతిరోజు లేవగానే నేను ఈ రోజు ప్రశాంతంగా ఉంటాను అని మనసులో పదిసార్లు అనుకోవాలి కోపం రావడానికి కారణం మీరు ఆశించినంతగా ఎదుటివారు చేయకపోవడమే....

37 వ రోజు

        Pic source: Yourquote       ప్రతి చీకటి కోణంలో కనిపించేవి మన బలహీనతలే. హిట్లర్ బలహీనత అతని ఉద్వేగాలు(ఎమోషన్స్) వ్యామోహం.        అలెగ్జాండర్ 29 ఏళ్లకే ప్రపంచాన్ని జయించాడు. ఉద్వేగాన్ని జయించలేక  వ్యసనంతో 32 ఏళ్ళకే మరణించాడు.           మనలోని ఉద్వేగాలను ఎలాగో  ఒకలాగ బయటకు పంపకపోతే గుండెపోటు,పక్షవాతం, కిడ్నీ సమస్యలు, అల్సర్లు వస్తాయి. అయితే వాటిని సరైన రీతిలో  నియంత్రించుకోవాలి

36 వ రోజు

          Pic source: Quora మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది ముఖ్యం కాదు. నిజంగా ముఖ్యమైనది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేదే.                               ____బ్రయిన్ ట్రేసీ ఈ ప్రశ్నలకు సరైన జవాబులు వెతుక్కోండి నా జీవితంలో నేను ఏం చేయాలని అనుకుంటున్నాను? నాకున్న ఆందోళనలో ప్రస్తుతం అన్నిటికన్నా పెద్దవి 3 ఏవి?  మీ కుటుంబానికి బంధుత్వానికి సంబంధించిన మూడు అతి ముఖ్యమైన లక్షణాలు ప్రస్తుతం ఏవి? మీరు ఎప్పుడు చేయాలి అనుకుంటూ చెయ్యటానికి భయపడిన పని ఏది?  ఈ ప్రపంచంలో మీరు ఎటువంటి మార్పు తీసుకురావాలని అనుకుంటున్నారు? You may read this article if you have enough time and patience. Answer to What's the aim of life? by Teng Wang https://www.quora.com/Whats-the-aim-of-life/answer/Teng-Wang-2?ch=3&share=f2517785&srid=uiy5g

35 వ రోజు

సూర్యుడికి గురి పెట్టండి. అంతవరకు మీరు చేరుకోలేక పోవచ్చు. కానీ మీ బాణం మీరు నిర్దేశించుకున్న ఎత్తు కన్నా మరింత ఎత్తుకు దూసుకుపోతుంది. మీ ఊహకు మించి మీరు విజయులవుతారు .                                           ___జె.హాలెస్ మీకై మీరు పరిమితులు విధించుకోకపోతే అసలు పరిమితులనేవే లేవు. Sky is not the limit. ఆకాశం హద్దు కాదు. 15 ఏళ్ల బాలిక తన తండ్రిని COVID సమయంలో తన గ్రామానికి సైకిల్‌పై 1200 కిలోమీటర్లు ప్రయాణించి  తీసుకెళ్ళింది. అప్పటివరకూ  సాధించలేరని అనుకున్నదానినిఎడ్మండ్ హిల్లరీ మొదటిసారి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. ఉసేన్ బోల్ట్ ఒలింపిక్స్ లో  100 మీ రేసును9.69 సెకన్లలో   పూర్తి చేశాడు.

34 వ రోజు

        pic source : verywell mind మీ జీవితం అంతా మీ ఆలోచనలు, ఉద్వేగాలు,ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఇవి ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. బద్దకాన్ని, వాయిదా వేసే పద్ధతిని పోగొట్టుకోవాలంటే పై మూడింటిని ఉపయోగించుకోవాలి. మీ ఆలోచన, వైఖరి, విలువలు జీవితం పట్ల  మీకన్న అభిప్రాయం మొదలైనవన్నీ మీ  ఉద్వేగాన్ని,ప్రవర్తనను శాసిస్తాయి. వాయిదా వేసే ధోరణి మీ నమ్మకాలు విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. మీ మానసిక శత్రువుల్ని పారద్రోలాలంటే మీలో ఏర్పడిన అపనమ్మకాన్ని తొలగించుకోవాలి.

33 వ రోజు

మీ జీవితంలో మీకు ఎన్నో దారులు కనిపిస్తాయి మీరు ఏ దారి వెళ్లాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మీకు ఉంది. మీకు సరైన దారి చూపేందుకు ఎన్నో సందేశాలు ప్రకృతి పంపిస్తుంది. సాధారణంగా వాటిని పట్టించుకోము. ఒకసారి మీరు దాన్ని నిశితంగా పరిశీలిస్తే బాగా అర్థమవుతుంది.  జీవితం అనేది మన ఎంపిక. ఏదో అదృష్టవశాత్తు వచ్చేది కాదు.సాధారణంగా మనం గాలివాటంతో  జీవితాన్ని గడుపుతాం.ప్రత్యేక శ్రద్ధ పెడితే జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు. జీవితం శిల అయితే దాన్ని మలచుకునే బాధ్యత మనదే. తమ దుస్థితికి పరిస్థితులు లేదా ఇతరులు కారణమని నిందిస్తూ ఉంటారు. నిజానికి ఈ లోకంలో విజేతలైన వారెవరూ పరిస్థితుల గురించి పట్టించుకోరు. ఉన్న పరిస్థితులను వినియోగించు కుంటారు.అనుకూలమైన పరిస్థితులు లేకపోతే  తామే అటువంటి పరిస్థితులు కల్పించు కుంటారు                                   ____ బెర్నాడ్ షా          మీకు నచ్చితే           ఆచరించండి! షేర్ చేయండి!        ...

32 వ రోజు

పుట్టడం ఒక సంఘటన. కానీ   మరణం మాత్రం  ఒక సంఘటన కారాదు.   అది చరిత్ర లో లిఖింపబడాలి. పుట్టుకతో పేదరికంలో ఉండి ఉండొచ్చు.  మరణించడం మాత్రం పేదరికంలో ఎంత మాత్రం జరగరాదు. పట్టుదలతో పేదరికం నుండి బయటపడాలి.  కృషి ని నమ్ముకున్న వ్యక్తికి సంపద చేకూరుతుంది. కృషి చేసే మనిషికి ప్రకృతి శక్తులు తోడ్పడతాయి. దారిద్ర్యాన్ని పారద్రోలతాయి. ఎదుటి వ్యక్తి ఎదగడానికి నువ్వు ఎంత మేరకు పాటు పడతావో నీ అభివృద్ధి కూడా అంత వరకూ ఉంటుంది.                                    _____ జిగ్ జిగ్ లర్          మీకు నచ్చితే           ఆచరించండి! షేర్ చేయండి!           లేకపోతే వదిలేయండి!