Skip to main content

30వ రోజు


మెదడు సక్రమంగా పనిచేయాలంటే కంటి నిండా నిద్రపోవాలి. లేకపోతే.. మానసిక సమస్యలు ఏర్పడి మీ రోజువారి పనులకు విఘాతం ఏర్పడుతుంది. నిద్రలేమి వల్ల మెదడుకు ఏర్పడే నష్టం.. ఓ ప్రమాదంలో తలకి తగిలే బలమైన గాయంతో సమానం.

మెదడు లో ఆలోచనలు పాదరసం లా నిరంతరం కదులుతూ ఉంటాయి.వాటిని అదుపులో పెట్టడానికి ధ్యానం సరైన మార్గం. ధ్యానం ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.


మెదడు ఒక తోట లాంటిది. అందులో  ఏ విత్తనాలు వేస్తే ఆ పంట  వస్తుంది. మెదడు ఒక సిడి లాంటిది. పెన్ డ్రైవ్ లాంటిది. నీవేమి అందులో రాస్తే అదే పలుకుతుంది.

బ్రెయిన్ పగటి పూట కంటే రాత్రే చురుగ్గా పనిచేస్తుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు తాజా జ్ఞాపకాలను భద్రపరచుకోవడంలో బిజీగా ఉంటుంది. అందుకే, నిద్రలేమి ప్రభావం జ్ఞాపకశక్తి మీద పడతుంది. మనిషి బతికున్నంతకాలం మెదడుకు విశ్రాంతి ఉండదు.

మెదడుకు పడుకోబోయేముందు మంచి ఆలోచనలు కలిగిస్తే మెదడు వాటిని స్వీకరించి
దాని కనుగుణంగా పని చేస్తుంది. మీ లక్ష్యాలను మీరు గనుక పడుకోబోయేముందు అనుకుంటూ ఉంటే కొన్ని రోజుల్లోనే మెదడు ఆ లక్ష్యాన్ని సాధించడానికి మార్గాలను కనుగొంటుంది.
పరిశోధకులు ఇదే మార్గం అనుసరిస్తారు.


మెదడును  బిల్డింగ్ చేసేది ఒమేగా -3 కొవ్వు ఆమ్లం.అందు వల్ల DHA ను ఎక్కువగా తీసుకోండి.  చేపలు , పాలు, గుడ్లు, పెరుగు,వాల్ నట్స్, ఆలివ్ ఆయిల్, అవిసె గింజలు మరియు సప్లిమెంట్స్ వంటి బలవర్థకమైన ఆహారాలలో DHA అధికంగా ఉంటుంది.

పాలు, వెన్న, గుడ్లు, కాయలు, తృణధాన్యాలు మరియు బచ్చలికూర వంటి ముదురు ఆకుకూరలలో లభించే విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి

మెదడు ఆరోగ్యానికి తోడ్పడే సహజ యాంటీఆక్సిడెంట్ అయిన లుటిన్ ఎక్కువ. ఆకుపచ్చ కూరగాయలలో లుటిన్ కనిపిస్తుంది

మెదడును ఉత్తేజపరిచే చర్యలలో పాల్గొనండి. చదవడం, క్రాస్‌వర్డ్‌లు మరియు క్రొత్త భాషను నేర్చుకోవడం,ఒక పాట నేర్చుకోవడం.

సినిమాలు చూడటం మానేయాలి.

మంచి పుస్తకాలు చదవాలి.  

మానసిక కాలుష్యం తగ్గించుకోవడానికి చురుకైన సామాజిక జీవితం అంటే ఎక్కువ మంది స్నేహితులు మరియు సామాజిక సమావేశాలలో పాల్గొనాలి. అధిక సామాజిక సంకర్షణ ఉన్నవారిలో కొత్త మెదడు కణాల ఉత్పత్తి, మెదడుకు మరమ్మత్తు కావడం జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.కాబట్టి, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం.

Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.