Skip to main content

Posts

Showing posts from April, 2021

100 వ రోజు

          pc LinkedIn 5 things to quit right now 1. trying to please every one 2.Fearing change 3. Living in the past 4 putting yourself down 5. Overthinking

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

97 వ రోజు

        pc: pinterest స్థిరబుద్ధి లేని మనిషి తన మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోలేడు. అహంభావనలు అదుపు తప్పుతుంటాయి. ప్రతికూల అనుభవాలను జీర్ణించుకోలేడు. తనను విమర్శించే వారంతా శత్రువులనుకుంటాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా, జ్ఞానప్రదాతలు గురువులైనా తనతో ఆనందాన్ని పంచుకుంటూ తన హితాన్ని కోరుకునేదెవరైనా, వారు చెబుతున్నదంతా అతడికి లోపభూయిష్ఠంగానే అనిపిస్తుంది. తప్పులు చేస్తూ అవి చిన్నవేనని సరిపెట్టుకుంటాడు. సరిదిద్దుకోలేని పెద్ద తప్పులూ చేస్తుంటాడు. ప్రలోభాలకు లొంగిపోతాడు. స్థిరబుద్ధితో వచ్చే విశిష్టమైన లక్షణాలు మనుషులకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తాయి. స్వశక్తిపై నమ్మకం పెంచుతాయి. వానరుడైనా తన బుద్ధికి ఉన్న స్థిరత్వంతో హనుమంతుడు బుద్ధిమంతుల్లోనే వరిష్ఠుడు అనిపించుకుని కార్యసాధకుడిగా కీర్తిమంతుడయ్యాడు. స్థిరబుద్ధి తెచ్చిపెట్టే పట్టుదలతో భగీరథుడు గంగను దివినుంచి భువికి దింపగలిగాడు. స్థిరబుద్ధితో సాధ్యమయ్యే ఏకాగ్రచిత్తం- లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా, అది దగ్గరలోనే ఉన్నట్లు అనిపింపజేస్తుంది. విలువిద్య ప్రదర్శన సమయంలో అర్జునుడు ఆ విషయం నిరూపించాడు. ధనుర్విద్యలో సాటిలేని వా...

96 వ రోజు

          pc: pinterest ప్రపంచం ఎలా నడుస్తోందో మనం తెలుసుకోవాలంటే ధ్యానంచేయాల్సిందే అంటాడు గౌతమ బుద్ధుడు. ఇది నిజం కూడా.. ధాన్యం తెలివినిస్తుంది. ధ్యానం చేయకపోతే, అంతాతెలియనిస్ధితి ఏర్పడి మనిషి అభివృద్ధి అసాధ్యమన్నది కొందరి భావన. మన సమాజంలో ప్రస్తుతం మన ఒత్తిడి తగ్గించడానికి అనేక ధ్యానపద్ధతులు నేర్పిస్తున్నారు మెడిటేషన్ ఎక్స్ పర్ట్స్. ఇవి ఎలా చేయాలి... వాటి ఉపయోగాలేంటంటే... మెడిటేషన్ (ధ్యానం) చేసేటప్పుడు మీవీపును నిటారుగా సౌకర్య వంతంగా పెట్టి కూర్చొని, కళ్ళు మూస్కొని, తేలికగా శ్వాసను పీల్చండి. ఈ ధ్యాన పద్ధతిలో శ్వాస మీ ప్రవేశించటం, బయటకు వదలటం ప్రక్రియను శ్రద్దగా గమనించాలి. దీనినే శ్వాస మీద ధ్యాస అని పిలుస్తాం. రోజూ ధ్యానాన్ని 15 నుండి 20 నిమిషాల పాటు చేస్తే మనిషిలో ఒత్తిడి గణనీయంగా తగ్గిపోతుంది. ఇక మానసిక ధాన్యంతో మనసును ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంచుకోవచ్చు. నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చొని, ప్రశాంతతని ఆశ్వాదిస్తూ...ఈ ధ్యానం రోజూ 10 నిమిషాల చొప్పున రెండుసార్లు చేస్తే చాలు. మనసు, శరీరం రెండు అనుసంధానించబడి ఊహించ లేని శక్తి కల్గి మనలో తీవ్ర నమ్మకాన్ని పెంచుతు...

95వ రోజు

      pc: dishadaily.com మనిషి తనలోని శక్తిని పూర్తిగా వినియోగించుకుంటే అద్భుతాలను సృష్టించగలడు. ఆనందంగా నూరేళ్లు జీవించే నైపుణ్యాలు జీవన వికాసానికి తోడ్పడతాయి. చీకటినుంచి వెలుగులోకి ప్రయాణించడమే అద్భుత జీవనం అంటే. ఎవరూ పుట్టుకతోనే ప్రతిభా సంపన్నులు కారు. అనుభవాలు పెరిగేకొద్దీ మానసిక పరిణతి, వివేకం, విచక్షణాజ్ఞానం వెన్నంటి వస్తాయి.  అణువులో బ్రహ్మాండాన్ని చూడటమే అద్భుతం.సంకల్పశక్తి, విశ్లేషణాశక్తి, సాధనాశక్తి- ఈ త్రిశక్తిధారణమే అద్భుతాలను సృష్టిస్తుంది. అద్భుతాలను సృష్టించేందుకు మాయలు, మంత్రాలు లేవు. కళ్లు మూసుకు కూర్చున్నంత మాత్రాన అద్భుతాలు జరిగిపోవు. కార్యరంగంలోకి యోధులై కదలనిదే అద్భుతాలు ఆవిష్కృతం కావు.     జీవన గమనంలో కష్టనష్టాలను మౌనంగా, గంభీరంగా భరించడం, ఓటమిని హుందాగా స్వీకరించడం, అవమాన భారాలను సహించడం, కన్నీరు ఉబికి వస్తున్నా చిరునవ్వులు చిందించే మనోస్థైర్యాన్ని చూపడం- కోపతాపాలను జయించడం, కష్టమని తెలిసినా ప్రయత్నమే విజయానికి నాంది అంటూ సంకల్ప  సిద్ధులు కావడం వంటివి ధీరగంభీరమైన వ్యక్తిత్వానికి నిదర్శనాలు. అవి జీవితాన్ని పండించే అద్భ...

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.

93 వ రోజు

ఐసులా కరిగిపోయే ఐశ్వర్యం కన్నా, మాటలా నిలిచిపోయే మంచితనమే గొప్పది.  కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే.  నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా కన్నీరుతుడిచే ఒక్క వేలు మిన్న.  నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోవడం అన్నిటికంటే కష్టతరం.  సంతృప్తిగలవాడు మట్టిని ముట్టినా బంగారమవుతుంది.  పుస్తకాలు, స్నేహితులు కొద్దిగా ఉన్నా మేలైనవిగా ఉండాలి.  ఆకలి వేసినా సింహం గడ్డిమేయదు. కష్టాలెన్ని చుట్టు ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.  

92 వ రోజు

       Pc mmlafleur.com సృజనాత్మకతను  పెంచుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించాలి ఒక విచిత్ర భావాన్ని ఊహించి మనసులో రూపకల్పన చేయండి నేను ముఖ్యమంత్రినైతే ఏం చేస్తాను నేను దండిగా డబ్బు సంపాదిస్తే ఏం చేస్తాను నేను ఒక రచయిత తన కార్యక్రమం ఎలా ఉంటుంది ఇలాంటి భావాలు ఊహించి కాగితంపై రాయండి మీరు ఒక చక్కని చిత్రాన్ని తీశారు చిత్రకారుడిగా మిమ్మల్ని సన్మానించి పొగడ్తలతో ముంచెత్తారు ఆ సమావేశం చివరన మీరిచ్చే ప్రసంగాన్ని కాగితంలో రాయండి టీవీ కార్యక్రమం పై విమర్శనాత్మకంగా వ్యాసం రాయండి రిటైరయ్యాక గడిపే జీవితం గురించి పాఠకులకు ఆసక్తి కలిగేలా ఆత్మ కథ రూపంలో రాయండి

91 వ రోజు

       pc reoveme       ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందరాదు. ఆందోళన చెందకుండా ఉండాలంటే సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి.అంతా మన మంచికే అనుకోవాలి.         మనసు ప్రశాంతంగా  లేకుంటే ఆందోళన పెరిగి అనేక రోగాలు వస్తాయి. రక్తపోటు,మధుమేహం, గ్యాస్ ట్రబుల్ మొదలైనవన్నీ చుట్టుముడతాయి.        ఏ సమస్యలైనా వస్తుంటాయి పోతుంటాయి. ఏవీ శాశ్వతం కాదు అని అర్థం చేసుకోవాలి.అది నిజం కూడా.మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి వీలైనంత సులభమైన పద్ధతి ఇది. దీంతో ఆవేశం తగ్గిపోతుంది. కోపం తగ్గిపోతుంది.         ఇంట్లో కొంచెం ఆలస్యమైతే బస్సు మిస్ అవుతుందని ఆందోళన చెందడం ఎక్కడో బండి పార్క్ చేసి మరిచిపోయి దాన్ని ఎవరో దొంగిలించారని ఆందోళన చెందడం ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే వాళ్లు డబ్బులు ఎగ్గొడతారే మోనని భయం ఇలాంటివన్నీ ఆందోళన కిందకు వస్తాయి. ప్రతి చిన్న విషయానికి మీరు ఆందోళన చెంది ఇతరులు ఆందోళన పెట్టరాదు.       అంతా మంచి జరుగుతుంది అంతా సానుకూలంగా జరుగుతుంది అంతా మన మంచికే అని పదేపదే మన మ...

90 వ రోజు

      pc:wikijobs.co.uk      మనం ఎవరితో తిరుగు తాము వారి లక్షణాలు మనకు వస్తాయి. దొంగలతో సావాసం చేస్తే దొంగతనం చాలా సులభం అనిపిస్తుంది. మంచి వారితో స్నేహం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి. స్నేహితులను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. నీ జీవితాన్నిి మలిచేది  మంచి స్నేహితులే. వారి అభిప్రాయాలు బలంగా నాటుకుంటే,నువ్వు అదే విధంగా జీవితాన్ని మార్చుకుంటావు.       నీ సొంత అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవాలంటే అనేక పుస్తకాలు చదవాలి.అనేక అనుభవాలు పొందాలి. ఎక్కువ మిత్రులు ఉంటే ఎంతో మంచిది. నీ లోని లోపాలను వారితో చెప్పించుకుని,వాటిని సరి చేసుకుంటే జీవితం ఉన్నతంగా మారుతుంది.

89 వ రోజు

    ఉగాది శుభాకాంక్షలతో....       మీరు సంతోషంగా ఉండటానికి ఏ అవరోధాలు  లేవు. మీ జీవితాన్ని సంతోషమైన చేసుకోవడం మీ జన్మ హక్కు. మీ జీవితాన్ని సంతోషంగా ఉండటానికి మీరే కారకులు,మరెవరో కాదు.        మీరు ప్రపంచాన్ని నవ్వుతూ చూస్తే ప్రపంచం నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అద్దంలాంటిది. మీరు ఉన్నచోట ఆనందంగా ఉండాలి లేకపోతే ఇంకెక్కడా ఆనందంగా ఉండలేరు.

88 వ రోజు

     pc: sidel.com         మీరు ప్రపంచాన్ని ఎదుర్కొన్నప్పుడు మీ విలువలు మీకు సహాయం చేస్తాయి మీ విలువలు మీ జీవితానికి చుక్కాని వంటివి.      విలువలకు సంబంధించిన కొన్ని సూత్రాలు మాటకు కట్టుబడి ఉండటం ఇతరులకు హాని చేయకపోవడం  ఇతరులను అవహేళన చేయకపోవడం  ఇతరుల సొమ్ము ఆశించక పోవడం  నిజాయితీగా ఉండటం

87 వ రోజు

        మార్పు నిరంతరంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో మార్పు చెందినది ఏదైనా ఉందంటే అది మార్పు మాత్రమే.         మీరు మార్పు చెందాలని అనుకుంటే మారతారు.అలాగే మిమ్మల్ని మార్చే శక్తి ఎవరికి ఉందంటే అది మీరే.      మీ ఆలోచనా దృక్పథం మార్చుకుంటే మీరు మారతారు. మీరు ఒక కోణంలోంచి చూస్తే కనబడే దృశ్యం, మరో కోణంలో మరో రకంగా కనిపిస్తుంది మీరు చూసే దృక్పథం బట్టే మార్పు ప్రారంభమవుతుంది.        మార్పు ప్రారంభమవడానికి ఒక్క నిమిషం చాలు. ఆ నిమిషం మీ నిర్ణయం తీసుకునే సమయమే.        నేను నిన్న  చాలా తెలివి గల వాడినని ఈ   ప్రపంచాన్ని మారుద్దామని బయలుదేరాను.నేడు నేను ఈ ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా మారాల్సింది నేనేనని తెలుసుకున్నాను. నేను మారితే నన్ను చూసి గాని, నన్ను చూసి    ప్రభావితులైన వారు గాని ఉంటే చుట్టూ సమాజం మారుతుందని తెలుసుకున్నా.       చార్లెస్ డార్విన్ ఇలా చెబుతాడు భూమ్మీద జీవులు ఎక్కువ కాలం బతికేది అత్యంత బలంగా ఉండటం వల్ల కాదు, అత్యంత తెలివి తేటలు తెలివ...

86 వ రోజు

           pc: isha.sadguru.com       ఒక మనిషి ఎందుకు తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటాడు? కొందరు వారి జీవితంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడవచ్చు. కానీ చాలామంది వారి మానసిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకోవడం  అంటే మార్పుకు అంగీకరించకపోవడమని అర్థం. ఒకానొక శూన్యత జీవితంలో ఆవరించడమని అర్థం.         నిరంతరం పని లో ఉన్నా, ఉత్సాహంగా ఉన్నా ఆత్మహత్య జోలికి వెళ్లరు. శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు పెద్దలు. ఈ శరీరం ఉండేది చాలా పనులు నిర్వహించడానికే నన్నారు. అలాగే పరోపకారార్ధం ఇదం శరీరం అని కూడా అన్నారు. ఈ శరీరం ఉండేది ఇతరులకు సహాయం అందించడానికే.అంటే సామాజానికి ఉపయోగం పడే విధంగా  మనం ఏదో ఒక పని చేయాలన్నా మాట.      గతాన్ని గురించి ఆలోచిస్తూ,  భవిష్యత్తు గురించి ఆందోళన చెందే వారికి ఆత్మహత్యలే శరణ్యమనిపిస్తుంది. అంతామనమంచికే సూత్రాన్ని పాటించాలి. ఏదైనా అవాంతరం ఎదురైతే మరొక సానుకూలమైన దారి ఏర్పడేవరకు వేచి చూడాలి. ఎందుకు ఇలా జరిగింది అని అనుక...

85 వ రోజు

     pc:  iai.tv జీవితం అంటే బతికి ఉండటం కాదు బాగా ఉండటం                              ___మార్షల్ మీ జీవితం మీ చేతుల్లో ఉంది.మీ ఆలోచన లే జీవితం. మీరు ఎలా ఆలోచిస్తారో అలా తయారవుతారు. నిర్ణయాలు తీసుకోవటం కాదు వాటి అమలు చాలా ముఖ్యం.  మీరు చేస్తున్న పనిలో సంతోషంగా ఉండాలి  మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి  మీకు సంపద చేకూరుతూ ఉండాలి  ఇవన్నీ సాధించాలంటే పని చాలా ముఖ్యం మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరు పై ఆధారపడి ఉంటుంది కన్ఫ్యూషియస్ చెప్పిన జీవిత సూత్రం ఇది:  మీరు బాగా అభిమానించే పని ఎంచుకోండి ఇక మీ జీవితంలో ఒక్క రోజు కూడా పని చేయాల్సిన అవసరం రానేరాదు . మీ ఆలోచనలు పరిశీలించండి  అదే పదాలు అవుతాయి  మీ పదాలు పరిశీలించండి  అవే ఆచరణలవుతాయి  మీ ఆచరణలను గమనించండి  అవి అలవాటు అవుతాయి  మీ అలవాట్లను గమనించండి  అదే మీ ప్రవర్తన అవుతుంది  మీ ప్రవర్తనను పరిశీలించండి  అదే మీ జీవితం అవుతుంది              ...

84 వ రోజు

 నేను మారుతున్నాను !! తల్లిదండ్రులను బంధువులను భార్యను పిల్లలను స్నేహితులను ఇన్నాళ్లు ప్రేమించాను ఇప్పుడిప్పుడే  నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు పెట్టాను. కూరగాయల వాళ్లతో పండ్లమ్మే వాళ్ళతో బేరాలు ఆడటం మానేశాను వాళ్లకు నాలుగు రూపాయలు ఎక్కు విచ్చినంత మాత్రాన నేను పెద్దగా నష్టపోయేది ఏమీ లేదని తెలుసుకున్నాను.  ఆ డబ్బులు వాళ్ల పిల్లల స్కూల్ ఫీజు కన్నా పనికి వస్తాయి. టాక్సీ డ్రైవర్ దగ్గర చిల్లర కోసం తగాదా పడటం లేదు ఆ కాస్త చిల్లర అతని మొహంలో నవ్వులు పూయించడం నాకు ఆనందంగా ఉంది. ఏదేమైనా జీవిక కోసం నాకన్నా ఎంతో కష్ట పడుతున్నాడతను. చెప్పిందే ఎందుకు చెబుతున్నావ్ అని పెద్దవాళ్ళను అడగడం మానేశాను వాళ్లు గతాన్ని నెమరు వేసుకోవడానికి అది పనికి వస్తుందని గ్రహించాను. ఉచితంగా ఉదారంగా అభినందనలు అందరిపై కురిపిస్తున్నాను. అది వారితో పాటు నాకు ఆనందాన్నిస్తోంది. చొక్కా పై పడ్డ మరకలు చూసి బెంబేలు పడటం మానేశాను. ఆకారం కన్నా వ్యక్తిత్వంముఖ్యం అని తెలుసుకున్నాను. నాకు విలువనివ్వని వారికి దూరం గా జరగడం నేర్చుకున్నానుు. వారికి నా విలువ ఏమిటో తెలిసి ఉండకపోవచ్చు కానీ నా విలువ ఎంతో నాకు తెలుసు...