జీవితమంటే...
జీవితమంటే అర్థమేమిటని తన గురువును ప్రశ్నించాడో శిష్యుడు.
‘జీవితమనే పదానికి నిఘంటుపరంగా జీవనమని అర్థం.'
జీవితాన్ని జీవించడం ద్వారా దానికొక ప్రయోజనం, విలువను ఇవ్వగలిగితే అది ఓ అర్థాన్ని సంతరించుకుంటుంది.
జీవితానికొక సార్థకతను, ఉదాత్తతను చేకూర్చాలి.
అలా చేయడానికి మనకొక అవకాశంగా జీవితం వచ్చిందని భావించాలి.
'మన జీవన విధానమే మన జీవితాన్ని అర్థవంతం చేసుకుంటున్నామో లేదో నిర్ణయించేది’ అని నిర్వచించాడా గురువు.
Nice sir
ReplyDelete