Skip to main content

33 వ రోజు

మీ జీవితంలో మీకు ఎన్నో దారులు కనిపిస్తాయి మీరు ఏ దారి వెళ్లాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మీకు ఉంది.
మీకు సరైన దారి చూపేందుకు ఎన్నో సందేశాలు ప్రకృతి పంపిస్తుంది. సాధారణంగా వాటిని పట్టించుకోము. ఒకసారి మీరు దాన్ని నిశితంగా పరిశీలిస్తే బాగా అర్థమవుతుంది. 

జీవితం అనేది మన ఎంపిక. ఏదో అదృష్టవశాత్తు వచ్చేది కాదు.సాధారణంగా మనం గాలివాటంతో 
జీవితాన్ని గడుపుతాం.ప్రత్యేక శ్రద్ధ పెడితే జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు.
జీవితం శిల అయితే దాన్ని మలచుకునే బాధ్యత మనదే.

తమ దుస్థితికి పరిస్థితులు లేదా ఇతరులు కారణమని నిందిస్తూ ఉంటారు. నిజానికి ఈ లోకంలో విజేతలైన వారెవరూ పరిస్థితుల గురించి పట్టించుకోరు. ఉన్న పరిస్థితులను వినియోగించు కుంటారు.అనుకూలమైన పరిస్థితులు లేకపోతే 
తామే అటువంటి పరిస్థితులు కల్పించు కుంటారు 
                                 ____ బెర్నాడ్ షా

         మీకు నచ్చితే 
         ఆచరించండి! షేర్ చేయండి! 
         లేకపోతే వదిలేయండి!
        

Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

97 వ రోజు

        pc: pinterest స్థిరబుద్ధి లేని మనిషి తన మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోలేడు. అహంభావనలు అదుపు తప్పుతుంటాయి. ప్రతికూల అనుభవాలను జీర్ణించుకోలేడు. తనను విమర్శించే వారంతా శత్రువులనుకుంటాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా, జ్ఞానప్రదాతలు గురువులైనా తనతో ఆనందాన్ని పంచుకుంటూ తన హితాన్ని కోరుకునేదెవరైనా, వారు చెబుతున్నదంతా అతడికి లోపభూయిష్ఠంగానే అనిపిస్తుంది. తప్పులు చేస్తూ అవి చిన్నవేనని సరిపెట్టుకుంటాడు. సరిదిద్దుకోలేని పెద్ద తప్పులూ చేస్తుంటాడు. ప్రలోభాలకు లొంగిపోతాడు. స్థిరబుద్ధితో వచ్చే విశిష్టమైన లక్షణాలు మనుషులకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తాయి. స్వశక్తిపై నమ్మకం పెంచుతాయి. వానరుడైనా తన బుద్ధికి ఉన్న స్థిరత్వంతో హనుమంతుడు బుద్ధిమంతుల్లోనే వరిష్ఠుడు అనిపించుకుని కార్యసాధకుడిగా కీర్తిమంతుడయ్యాడు. స్థిరబుద్ధి తెచ్చిపెట్టే పట్టుదలతో భగీరథుడు గంగను దివినుంచి భువికి దింపగలిగాడు. స్థిరబుద్ధితో సాధ్యమయ్యే ఏకాగ్రచిత్తం- లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా, అది దగ్గరలోనే ఉన్నట్లు అనిపింపజేస్తుంది. విలువిద్య ప్రదర్శన సమయంలో అర్జునుడు ఆ విషయం నిరూపించాడు. ధనుర్విద్యలో సాటిలేని వా...