చీకటి తగినంత దట్టంగా ఏర్పడినప్పుడే నీకు నక్షత్రాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి
__చార్లెస్ బియర్డ్
కోపం మిమ్మల్ని దహించివేస్తుంది. కోపాన్ని మనం ప్రేమించే వారిపై చూపించరాదు. కోపాన్ని చూపించాల్సింది మీ లక్ష్యం మీద, మీ అసహ్యకర పద్ధతుల మీద.
కోపాన్ని ప్రదర్శించటం అంటే మీ చేతిలో నిప్పు పెట్టుకుని ఇతరులపై విసరటం లాంటిదని చెపుతాడు బుద్ధుడు.
కోపం తగ్గిపోయాక మీ మనస్సు ఎంతగానో గాయపడుతుంది.
ఎదుటి వారితో సంబంధాలు దెబ్బతింటాయి.
మిమ్మల్ని ప్రేమించే వారు మీకు దూరం అవుతారు.
కోపాన్ని నిగ్రహించుకోవడానికి మీ ఆహారం మీ ఆరోగ్యం తోడ్పడుతాయి.
సాత్వికాహారం తీసుకోవాలి.
అల్సర్ తో కడుపులో పుండ్లు లేకుండా చూసుకోవాలి.
ఎక్కువగా నీళ్లు తాగాలి.
ప్రతిరోజు లేవగానే నేను ఈ రోజు ప్రశాంతంగా ఉంటాను అని మనసులో పదిసార్లు అనుకోవాలి
కోపం రావడానికి కారణం మీరు ఆశించినంతగా ఎదుటివారు చేయకపోవడమే. అంటే ఎదుటి వారి సామర్థ్యం అంతే అని గ్రహించాలి.ఎక్కువగా వారి నుంచి ఆశించరాదని అర్థం. అప్పుడు మీకు కోపం రాదు.
ఎదుటి వారు మిమ్మల్ని బాధించినా కించపరిచినా కోపం రావచ్చు. అది ఎదుటివారి బలహీనత. వారి బలహీనతను క్షమించి వదిలివేయటమే ఉత్తమం. లేదంటే మన మనస్సు కకావికలం అవుతుంది. ఆరోగ్యం ఖరాబవుతుంది.
వీటిని ఎంత ఎక్కువ అమలు చేస్తే అంత ప్రశాంతంగా ఉంటారు.
Comments
Post a Comment