Skip to main content

48 వ రోజు



(pic source: dreamstime.com)
ఈ 6 అల‌వాట్లు మీ జీవితాన్నే మారుస్తాయి.


హాల్ ఎలోర్డ్   అనే ప్ర‌ముఖ ర‌చ‌యిత రాసిన.  
“ద మిరాకిల్ మార్నింగ్” గ్రంథం లో ఉద‌యం 8 లోపు చేసే 6 ప‌నులు మ‌న జీవితాన్నే మారుస్తాయని చాలా స్ఫ‌ష్టంగా చెప్పాడు. 

6 అంశాల ప్రణాళిక. S.A.V.E.R.S

S-Silence( నిశ్శ‌బ్దం)

     మ‌న ప్ర‌తి రోజును చాలా నిశ్శ‌బ్దంగా ప్రారంభించాలి…అంటే ప్ర‌శాంత‌త‌తో స్టార్ట్ చేయాలి..లేవ‌డం లేట‌య్యింది…అయ్యే ఎలా…? ఆఫీస్ ప‌ని…ఈ రోజు అత‌డిని క‌లుస్తాన‌ని చెప్పాను…ఎమోయ్…టిఫిన్ అయ్యిందా…..ఇదిగో ఇంత‌లా హైరానా ప‌డొద్దు… ప్ర‌శాంతంగా లేవ‌గానే….కాసింత సేపు మెడిటేష‌న్ చేయండి. లేదా…క‌ళ్ళు మూసుకొని ప్ర‌శాంత‌త‌ను మీ మ‌న‌స్సులోకి ఆహ్వానించండి. ఇక్క‌డే మ‌న రోజు ఎలా గ‌డుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది .

A-Affirmations ( నీతో నువ్వు మాట్లాడుకోవ‌డం)

 అంద‌రి గురించి, అన్ని విష‌యాల గురించి అన‌ర్గ‌లంగా మాట్లాడే మ‌నం…మ‌న‌తో మ‌నం ఒక్క‌సారి కూడా మాట్లాడుకోలేక‌పోతున్నాం. అస‌లు మ‌న‌లోని మ‌న‌కు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళ‌ల్లో ఖ‌చ్చితంగా ఈ ల‌క్ష‌ణం ఉంటుంది. ఈ మూడు పాయింట్స్ ప్ర‌తి రోజు మీతో మీరు మాట్లాడుకోండి.

1) నేనేమి కావాల‌నుకుంటున్నా.??//
 ఈరోజు ఏం చేయాలనుకుంటున్నాను?
2)దాని కోసం నేను ఎటువంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాను‌??
3) అనుకున్న‌ది సాధించ‌డం కోసం నేను వేటిని వ‌దిలివెయ్యాలి? వేటిని కొత్త‌గా ఆహ్వానించాలి? ఇలా ప్ర‌తి రోజూ మ‌న‌లో మ‌నం మాట్లాడుకుంటూ….మ‌న‌లోని మార్పును మ‌న‌మే లెక్కించాల‌న్న మాట‌.!

V-Visualization ( ఆత్మ సాక్షాత్కారం)

      మ‌నలోని భావాలకు మ‌న‌స్సులో దృశ్య‌రూపం ఇవ్వ‌డం. కాన్సియ‌స్ తో క‌ల‌లు క‌న‌డం అన్నమాట‌! ఉద‌యాన్నే మ‌న ల‌క్ష్యం అలా క‌ళ్ళ ముందు క‌న‌బ‌డితే…దానిని చేరుకోవడం కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌య‌త్నం చేస్తాం.

E-Exercise 

    ఇది ప్ర‌తి ఒక్క‌రికి తెల్సిన విష‌య‌మే… కండ‌రాలు, న‌రాలు ఉత్తేజిత‌మై…కొత్త శ‌క్తిని ప్రేరేపిస్తుంది.

R-Reading

  కనీసం 10 పేజీలు చ‌ద‌వడాన్ని అల‌వాటు చేసుకోవాలి..ఇది మ‌నలోని అంత‌ర్గ‌త శ‌క్తిని ప్రేరేపిస్తుంది. ఫ‌లానా బుక్ చ‌ద‌వాల‌ని లేదు..మీకు తోచిన బుక్ ను చ‌దువుతూ పోండి.

S-Scribling( రాయ‌డం)- 
  ఉద‌యం …మీకు తోచిన లైన్స్ రాయండి… వీటిని మార్నింగ్ పేజెస్ అంటారు. ఇలా మీరు రోజూ రాస్తూ పోతే…మీ ఆటిట్యూడ్ లో మీకే తెలియ‌ని పాజిటివ్ వేవ్స్ వ‌స్తాయ్.

ఈ ప‌నుల‌న్నీ ఉద‌యం 8 లోపే చేయాలి.

Comments

Post a Comment

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.