Skip to main content

96 వ రోజు

          pc: pinterest

ప్రపంచం ఎలా నడుస్తోందో మనం తెలుసుకోవాలంటే ధ్యానంచేయాల్సిందే అంటాడు గౌతమ బుద్ధుడు. ఇది నిజం కూడా.. ధాన్యం తెలివినిస్తుంది. ధ్యానం చేయకపోతే, అంతాతెలియనిస్ధితి ఏర్పడి మనిషి అభివృద్ధి అసాధ్యమన్నది కొందరి భావన. మన సమాజంలో ప్రస్తుతం మన ఒత్తిడి తగ్గించడానికి అనేక ధ్యానపద్ధతులు నేర్పిస్తున్నారు మెడిటేషన్ ఎక్స్ పర్ట్స్. ఇవి ఎలా చేయాలి... వాటి ఉపయోగాలేంటంటే... మెడిటేషన్ (ధ్యానం) చేసేటప్పుడు మీవీపును నిటారుగా సౌకర్య వంతంగా పెట్టి కూర్చొని, కళ్ళు మూస్కొని, తేలికగా శ్వాసను పీల్చండి. ఈ ధ్యాన పద్ధతిలో శ్వాస మీ ప్రవేశించటం, బయటకు వదలటం ప్రక్రియను శ్రద్దగా గమనించాలి. దీనినే శ్వాస మీద ధ్యాస అని పిలుస్తాం. రోజూ ధ్యానాన్ని 15 నుండి 20 నిమిషాల పాటు చేస్తే మనిషిలో ఒత్తిడి గణనీయంగా తగ్గిపోతుంది. ఇక మానసిక ధాన్యంతో మనసును ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంచుకోవచ్చు. నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చొని, ప్రశాంతతని ఆశ్వాదిస్తూ...ఈ ధ్యానం రోజూ 10 నిమిషాల చొప్పున రెండుసార్లు చేస్తే చాలు. మనసు, శరీరం రెండు అనుసంధానించబడి ఊహించ లేని శక్తి కల్గి మనలో తీవ్ర నమ్మకాన్ని పెంచుతుంది. . ధ్యానించేటపుడు ఎంత ప్రధానమైన పని అయినా సరే వదిలేసి పాజిటివ్‌ ఆలోచనలోకి వెళ్లాలి. ఊహా ధ్యానం మరో పద్దతి. రోజులో 20-30 నిమిషాల సమయం పూర్తి విశ్రాంతిలో ఉంటూ, ఆహ్లాదాన్నిచ్చే చిత్రాలు, బొమ్మలు, పెయింటింగ్‌లు చూస్తూ వుండండి.అవి మీ మనస్సుల్లో నెలకొన్న ఆందోళనల్ని తగ్గించి...పూర్తిస్థాయి విశ్రాంతిని కలిగిస్తాయి.

Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.