Skip to main content

95వ రోజు


      pc: dishadaily.com

మనిషి తనలోని శక్తిని పూర్తిగా వినియోగించుకుంటే అద్భుతాలను సృష్టించగలడు. ఆనందంగా నూరేళ్లు జీవించే నైపుణ్యాలు జీవన వికాసానికి తోడ్పడతాయి. చీకటినుంచి వెలుగులోకి ప్రయాణించడమే అద్భుత జీవనం అంటే.

ఎవరూ పుట్టుకతోనే ప్రతిభా సంపన్నులు కారు. అనుభవాలు పెరిగేకొద్దీ మానసిక పరిణతి, వివేకం, విచక్షణాజ్ఞానం వెన్నంటి వస్తాయి. 

అణువులో బ్రహ్మాండాన్ని చూడటమే అద్భుతం.సంకల్పశక్తి, విశ్లేషణాశక్తి, సాధనాశక్తి- ఈ త్రిశక్తిధారణమే అద్భుతాలను సృష్టిస్తుంది. అద్భుతాలను సృష్టించేందుకు మాయలు, మంత్రాలు లేవు. కళ్లు మూసుకు కూర్చున్నంత మాత్రాన అద్భుతాలు జరిగిపోవు. కార్యరంగంలోకి యోధులై కదలనిదే అద్భుతాలు ఆవిష్కృతం కావు.

    జీవన గమనంలో కష్టనష్టాలను మౌనంగా, గంభీరంగా భరించడం, ఓటమిని హుందాగా స్వీకరించడం, అవమాన భారాలను సహించడం, కన్నీరు ఉబికి వస్తున్నా చిరునవ్వులు చిందించే మనోస్థైర్యాన్ని చూపడం- కోపతాపాలను జయించడం, కష్టమని తెలిసినా ప్రయత్నమే విజయానికి నాంది అంటూ సంకల్ప  సిద్ధులు కావడం వంటివి ధీరగంభీరమైన వ్యక్తిత్వానికి నిదర్శనాలు. అవి జీవితాన్ని పండించే అద్భుత రసగుళికలు.


(ఈనాడు ఆంతర్యామి,23.4.2021,దానం శివప్రసాదరావు, నుండి)


Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.