Skip to main content

84 వ రోజు


 నేను మారుతున్నాను !!

తల్లిదండ్రులను బంధువులను భార్యను పిల్లలను స్నేహితులను ఇన్నాళ్లు ప్రేమించాను
ఇప్పుడిప్పుడే  నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు పెట్టాను.

కూరగాయల వాళ్లతో పండ్లమ్మే వాళ్ళతో బేరాలు ఆడటం మానేశాను వాళ్లకు
నాలుగు రూపాయలు ఎక్కు విచ్చినంత మాత్రాన నేను పెద్దగా నష్టపోయేది ఏమీ లేదని తెలుసుకున్నాను.
 ఆ డబ్బులు వాళ్ల పిల్లల స్కూల్ ఫీజు కన్నా పనికి వస్తాయి.

టాక్సీ డ్రైవర్ దగ్గర చిల్లర కోసం తగాదా పడటం లేదు
ఆ కాస్త చిల్లర అతని మొహంలో నవ్వులు పూయించడం నాకు ఆనందంగా ఉంది.
ఏదేమైనా జీవిక కోసం నాకన్నా ఎంతో కష్ట పడుతున్నాడతను.

చెప్పిందే ఎందుకు చెబుతున్నావ్ అని పెద్దవాళ్ళను అడగడం మానేశాను
వాళ్లు గతాన్ని నెమరు వేసుకోవడానికి అది పనికి వస్తుందని గ్రహించాను.

ఉచితంగా ఉదారంగా అభినందనలు అందరిపై కురిపిస్తున్నాను.
అది వారితో పాటు నాకు ఆనందాన్నిస్తోంది.

చొక్కా పై పడ్డ మరకలు చూసి బెంబేలు పడటం మానేశాను.
ఆకారం కన్నా వ్యక్తిత్వంముఖ్యం అని తెలుసుకున్నాను.

నాకు విలువనివ్వని వారికి దూరం గా జరగడం నేర్చుకున్నానుు.
వారికి నా విలువ ఏమిటో తెలిసి ఉండకపోవచ్చు కానీ నా విలువ ఎంతో నాకు తెలుసు.

ఎవరైనా నన్ను తీవ్రమైన పోటీ లోకి లాగాలని చూసినప్పుడు ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాను.
నాకు ఎవరితో పోలిక పోటీ అవసరం లేదు.

నా భావావేశాలు నన్ను కలవర పెట్టకుండా చూసుకుంటున్నాను
ఎందుకంటే నన్ను నన్నుగా మనిషిగా నిలబెట్టేవి అవే
ఒక బాంధవ్యాన్ని ఒక సంబంధాన్ని తుంచు కోవడం కన్నా అహంకారాన్ని చంపుకోవడం మంచిదని గ్రహించాను
ఎందుకంటే నా అహంకారం నన్ను ఒంటరి గా నిలబెడుతుంది
సంబంధ బాంధవ్యాలు కొనసాగితే నేను ఎప్పుడూ ఒంటరిని కాదు కదా

ప్రతిరోజు అదే చివరి రోజు అన్నట్టుగా బతకడం నేర్చుకున్నాను 

అవును నేను మారుతున్నాను!!
నా సుఖసంతోషాలకు నేనే...నేను మాత్రమే బాధ్యుడిని.

Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.