ఐసులా కరిగిపోయే ఐశ్వర్యం కన్నా, మాటలా నిలిచిపోయే మంచితనమే గొప్పది.
కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే.
నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా కన్నీరుతుడిచే ఒక్క వేలు మిన్న.
నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోవడం అన్నిటికంటే కష్టతరం.
సంతృప్తిగలవాడు మట్టిని ముట్టినా బంగారమవుతుంది.
పుస్తకాలు, స్నేహితులు కొద్దిగా ఉన్నా మేలైనవిగా ఉండాలి.
ఆకలి వేసినా సింహం గడ్డిమేయదు. కష్టాలెన్ని చుట్టు ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.
Comments
Post a Comment