ఒక మనిషి ఎందుకు తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటాడు? కొందరు వారి జీవితంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడవచ్చు. కానీ చాలామంది వారి మానసిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకోవడం అంటే మార్పుకు అంగీకరించకపోవడమని అర్థం. ఒకానొక శూన్యత జీవితంలో ఆవరించడమని అర్థం.
నిరంతరం పని లో ఉన్నా, ఉత్సాహంగా ఉన్నా ఆత్మహత్య జోలికి వెళ్లరు. శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు పెద్దలు. ఈ శరీరం ఉండేది చాలా పనులు నిర్వహించడానికే నన్నారు. అలాగే పరోపకారార్ధం ఇదం శరీరం అని కూడా అన్నారు. ఈ శరీరం ఉండేది ఇతరులకు సహాయం అందించడానికే.అంటే సామాజానికి ఉపయోగం పడే విధంగా మనం ఏదో ఒక పని చేయాలన్నా మాట.
గతాన్ని గురించి ఆలోచిస్తూ, భవిష్యత్తు గురించి ఆందోళన చెందే వారికి ఆత్మహత్యలే శరణ్యమనిపిస్తుంది. అంతామనమంచికే సూత్రాన్ని పాటించాలి. ఏదైనా అవాంతరం ఎదురైతే మరొక సానుకూలమైన దారి ఏర్పడేవరకు వేచి చూడాలి. ఎందుకు ఇలా జరిగింది అని అనుకోవాలి గానీ,నాకే ఎందుకిలా జరిగిందని అనుకోరాదు. అంతా మన మంచికే అనుకోవడం ఉత్తమమైన పని.గతాన్ని మర్చి పోతుండాలి.పదేపదే చెప్పుకోవడం, గుర్తు చేసుకోవడం సరైంది కాదు.
సినిమా నటుడు రంగనాథ్ జీవించడానికి అవసరమైన ప్రేమ దొరక లేదని, ఇంకేమీ చేసే పనులు లేవని బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అలా చేసుకోకూడదు.సమాజానికి
ప్రేమ విఫలమైతే, ఇతరులను ప్రేమించాలి. సమాజాన్ని ప్రేమించాలి. ప్రేమని చచ్చిన ప్రేమ వచ్చును అన్నాడు గురజాడ.
అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి చెప్పినట్లు "లే లేవోయ్ మ్రోగె నగారా, నైరాశ్యం ఒక జాడ్యం, ఎత్తు ఎత్తు చైతన్యపు జెండా" అంటూ కర్తవ్యం లోకి దిగాలి.
Life is super power get it
ReplyDelete