మార్పు నిరంతరంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో మార్పు చెందినది ఏదైనా ఉందంటే అది మార్పు మాత్రమే.
మీరు మార్పు చెందాలని అనుకుంటే మారతారు.అలాగే మిమ్మల్ని మార్చే శక్తి ఎవరికి ఉందంటే అది మీరే.
మీ ఆలోచనా దృక్పథం మార్చుకుంటే మీరు మారతారు. మీరు ఒక కోణంలోంచి చూస్తే కనబడే దృశ్యం, మరో కోణంలో మరో రకంగా కనిపిస్తుంది మీరు చూసే దృక్పథం బట్టే మార్పు ప్రారంభమవుతుంది.
మార్పు ప్రారంభమవడానికి ఒక్క నిమిషం చాలు. ఆ నిమిషం మీ నిర్ణయం తీసుకునే సమయమే.
నేను నిన్న చాలా తెలివి గల వాడినని ఈ ప్రపంచాన్ని మారుద్దామని బయలుదేరాను.నేడు నేను ఈ ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా మారాల్సింది నేనేనని తెలుసుకున్నాను. నేను మారితే నన్ను చూసి గాని, నన్ను చూసి ప్రభావితులైన వారు గాని ఉంటే చుట్టూ సమాజం మారుతుందని తెలుసుకున్నా.
చార్లెస్ డార్విన్ ఇలా చెబుతాడు భూమ్మీద జీవులు ఎక్కువ కాలం బతికేది అత్యంత బలంగా ఉండటం వల్ల కాదు, అత్యంత తెలివి తేటలు తెలివితేటలు ఉండటం వల్ల కాదు, కానీ అవి మార్పులకు ఎప్పటికప్పుడు తలొంచడం వల్లనేనని. దీన్ని adaptability అంటారు.
మార్పుకు సిద్ధమైతే జీవితం ప్రశాంతంగా పురోగమిస్తుంది.
Comments
Post a Comment