ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందరాదు. ఆందోళన చెందకుండా ఉండాలంటే సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి.అంతా మన మంచికే అనుకోవాలి.
మనసు ప్రశాంతంగా లేకుంటే ఆందోళన పెరిగి అనేక రోగాలు వస్తాయి. రక్తపోటు,మధుమేహం, గ్యాస్ ట్రబుల్ మొదలైనవన్నీ చుట్టుముడతాయి.
ఏ సమస్యలైనా వస్తుంటాయి పోతుంటాయి.
ఏవీ శాశ్వతం కాదు అని అర్థం చేసుకోవాలి.అది నిజం కూడా.మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి వీలైనంత సులభమైన పద్ధతి ఇది. దీంతో ఆవేశం తగ్గిపోతుంది. కోపం తగ్గిపోతుంది.
ఇంట్లో కొంచెం ఆలస్యమైతే బస్సు మిస్ అవుతుందని ఆందోళన చెందడం ఎక్కడో బండి పార్క్ చేసి మరిచిపోయి దాన్ని ఎవరో దొంగిలించారని ఆందోళన చెందడం ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే వాళ్లు డబ్బులు ఎగ్గొడతారే మోనని భయం ఇలాంటివన్నీ ఆందోళన కిందకు వస్తాయి. ప్రతి చిన్న విషయానికి మీరు ఆందోళన చెంది ఇతరులు ఆందోళన పెట్టరాదు.
అంతా మంచి జరుగుతుంది అంతా సానుకూలంగా జరుగుతుంది అంతా మన మంచికే అని పదేపదే మన మనసులో అనుకోవడం వల్ల ఆందోళన తగ్గి ప్రశాంతంగా మనసుంటుంది
ఆందోళన తగ్గించడానికి సానుకూల దృక్పథం పెరగడానికి ముఖ్యంగా బి, డి,సి విటమిన్లున్న ఆహారం తీసుకోవాలి. ఇవి లోపించడం వల్ల ఆందోళన,నిద్రలేమి, పెదాల, పగుళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
Comments
Post a Comment