Tirukkural
1.పేరు ప్రతిష్టలు తెచ్చును ధనం, కాని
మచ్చ లేని మనుషులు ఆ ధనం కొరకు
ఎవరికీ కలిగించరు హాని.
2.అపకారికైనా కోపంతో చేయకు అపకారం
సహనంతో వ్యవహరించుట నీవు చేసే
ఉపకారం
3.కావాలని చెడు చేసే దుష్టులపై చేస్తే
ప్రతీకారం
తప్పించుకోలేని కష్టాలను కొని తెచ్చుకోవటం
4.నీవు అపకారిని శిక్షించే విధానం
నీవు చేసిన ఉపకారం ద్వారా అతను పొందే
అవమానం.
5.పరుల కష్టాలను తనదిగా భావించలేనినాడు
వివేక వంతుడికైనా కలగదు మంచి ఏనాడు.
6.నీకు బాధ కలిగించే పని
ఎవరికి కలిగించకు అట్టి హాని
7.మనసులోనైనా పరులకు కీడు తలంచకు
మనసు గల మనిషిగా ఎవ్వరికీ తలదించకు
8.కీడువలన కలిగే బాధ తెలిసిన నీవు
పరులకెందుకు కీడు చేయాలని చూస్తావు?
9.నీవు పరులకు అపకారం చేస్తే ఉదయంపూట
నిన్ను వెంటాడును అపకారం మధ్యాహ్నం
పూట
10.తనకు హాని కోరనివాడు - పరులకు చేస్తే
హాని
తలకు చుట్టుకొనును తిరిగి తనకు అంతకు
మించిన గ్లాని.
....తిరుక్కురళ్
Comments
Post a Comment