ప్రేమ
ఈ సృష్టిలో అత్యున్నతమైన భావం ప్రేమే. ప్రేమతో సర్వం సాధ్యమే.
🔸ప్రేమతో జీవించడం అంటే అత్యున్నతమైన జ్ఞానంతో జీవించడమే.
🔸మనం చేసే ప్రతి పని ప్రేమతో చేయడం ద్వారా జీవితం పరిపూర్ణం అవుతుంది.
🔸 నీ పట్ల నీవు ప్రేమను కలిగి ఉంటే జీవితంలోని అన్ని కోణాలలో నీకు శుభమే కలుగుతుంది.
🔸 నిన్ను నీవు ప్రేమించుకోవడం మొదలు పెట్టిన వెంటనే నీకు స్వస్థత మొదలవుతుంది.
🔸 ధ్యానం చేయడం అంటే నిన్ను నీవు అత్యున్నతంగా ప్రేమించుకోవడమే.
🔸 "నన్ను నేను ప్రేమించుకుంటున్నాను" అని మనసులో అనేక సార్లు మననం చేసినా కూడా అద్భుతమైన ప్రభావం ఉంటుంది.
🔸నీ ఆలోచనలు ప్రేమతో ఉంటే జీవితంలో అన్ని సాధ్యమే.

Comments
Post a Comment