ఒక రోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు.
రవివర్మను గుర్తుపట్టిన ఓ అమ్మాయి సంతోషంతో ఆయన దగ్గరకు వెళ్ళి పలకరించి , ఏదైనా చిన్న పేయింటింగ్ గీసి ఇవ్వమని అభ్యర్థించింది.
"బజారులో పేయింటింగ్ ఎలా చిత్రించడం ? మరోసారి కలిసినపుడు తప్పక చిత్రాన్ని వేసిస్తా" అన్నాడు రవివర్మ.
ఆ అమ్మాయి మొండిగా మారాం చేసింది.
ఆమెను నొప్పించలేక ఒక పేపర్ పై అప్పటికప్పుడు చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు రవి. ఇస్తూ ఇస్తూ నవ్వుతూ "దీని విలువ కోటి రూపాయలు.జాగ్రత్తగా కాపాడుకో." అన్నాడు
ఆ అమ్మాయి ఆశ్చర్యంగా ఆ పెయింటింగ్ చూస్తూ ఉండి పోయింది.
మరుసటి రోజు ప్రముఖ చిత్రకారుల చిత్రాలు అమ్మే వ్యక్తిని కలిసి "ఇది రవివర్మ గీసిన చిత్రం. దీన్ని అమ్మితే ఎంత ధరకు అమ్ముడు పోతుంది?" అని అడిగింది.
ఆయన కూడా రవివర్మ చెప్పినట్లే " కోటి దాకా పలకొచ్చు" అన్నాడు.
ఆమె విస్మయంతో నోటమాట రాక మళ్ళీ రవివర్మను కలవడానికి వెళ్ళింది.
రవివర్మను కలిసి "మీరు పది నిమిషాలలో చిత్రించిన చిత్రానికి ఇంత విలువ ఉంటుందని అనుకోలేదు" అంటూ ఆశ్చర్యంగా తన కాళ్లను గుండ్రంగా తిప్పింది.
రవి చిరునవ్వు నవ్వాడు.
"నాకు కూడా చిత్రకళలోని మెళకువలు నేర్పండి. మీలా పది నిమిషాలలో కాక పౌయినా....పది రోజులకు ఒక చిత్రాన్నైనా గీస్తా"అందా గడుసమ్మాయి.
రవివర్మ నవ్వుతూ అన్నాడు " అమ్మాయీ...! నీకు పది నిమిషాలలో చిత్రాన్ని గీసిచ్చాను. నిజమే. దీని వెనకాల నా 30 సంవత్సరాల కఠోర సాధన ఉంది. తెలుసా? నువ్వూ నీ 30 సంవత్సరాలు ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే నాలా తయారవుతావు"
ఆ అమ్మాయి నోటమాట రాక అలాగే చూస్తూ ఉండి పోయింది.
Comments
Post a Comment