Skip to main content

65 వ రోజు


       pc enaadu.net
త్రికోణ జీవితం

 జీవితం మూడింటితో ముడివడి ఉంది. సమరం, సాధన, ఆస్వాదన- ఈ త్రికోణ రూపమే జీవితం

పుట్టుక నుంచి పుడమి గర్భంలోకి వెళ్ళేవరకు జీవితం ఓ సమరాన్ని తలపిస్తుంది బతుకు పోరాటం, బతికించడం కోసం ఉనికిని కాపాడుకోవడం, బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్య దశల్లో ధర్మాచరణ, కుటుంబ సౌఖ్యం, సంతానం, ప్రయోజకత్వం వృద్ధాప్యం, బాధలు, వ్యాధులు.... అంతా ఓ సంగ్రామం

గ్రహాల గమనస్థితి నుంచి సూక్ష్మ జీవరాశి వరకు క్రియాశీల వైఖరి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మానవాళి జీవితంలో అనుభవాల రాసిళ్లు తప్పేవి కావు. శరీరాన్ని, మనసును, బుద్ధిని ఉపయోగించి మానవుడు జీవన సమరంలో విజేతగా నిలవాలి. సమయానుకూలంగా, సావధానంగా రాదు సమరం. అనునిత్యం అనుక్షణం సమర వాతావరణమే.

వైవాహిక జీవితం, గృహస్థాశ్రమం నల్లేరు మీద నడక కావు. సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనుకుంటాడు యజమాని, తన వృద్ధాప్య దశ హాయిగా సాగిపోవాలనుకుంటాడు. కానీ క్షణక్షణానికి మారే మనస్తత్వ వైఖరులు వాతావరణాన్ని అశాంతి పాలు చేయవచ్చు పైను సమస్యలు తీరక పట్టి పీడించనూవచ్చు. వృద్ధాప్యమొక శాపంలా పరిణమించ వచ్చు. ఏ దశ కూడా వడ్డించిన విస్తరి కాదు.కడ దాకా పోరాటమే. ఎప్పటికప్పుడు బలాన్ని సమకూర్చుకుంటూ సమర క్షేత్రంలో పోరు సల్పవలసిందే. జీవితం విసిరే సవాళ్లను సాధనా సంపత్తితో ఎదుర్కోవాలి సాధన అద్వితీయమైన శక్తి. అది చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. సాధనాజగత్తులో జాడ్యానికి, సోమరితనానికి తావుండదు సాధనలో తొందరపాటు, తొట్రుపాటు ఉండవు ఏదో ఒక్క విజయంతో జగిపోయేది కాదు. సాధన సాధనమున పనులు సమకూరు ధర లోన' అన్నాడు ప్రజాకవి వేమన జీవితంలో ఆవకాశాలు అందినట్లే అంది జారిపోతాయి ఫలితాలు తారుమారు కావచ్చు. భవిష్యత్తు చీకటిమయంగా తోచవచ్చు. ఆశించిన లక్ష్యం ఆందుకోలేకపోవచ్చు, సాధనే సర్వత్రా విజయవంతమని గ్రహించినవారు
జీవితం విసిరే ఏ సవాలునైనా నవ్వుతూ స్వీకరిస్తారు. విరామంతో 'ఇక విశ్రాంతి కాలం' అంటూ కాలాన్ని వృధాగా వెళ్లబుచ్చడం అంటే- ఆది కొరివితో తలగోక్కోవడమేనని తెలుసుకోవాలి. కాళ్లు చేతులు, మనసు పనిచేస్తున్నంతవరకు సాధనామయ జగత్తులో శ్రమించవలసి ఉంటుంది. గృహిణి జీవితమంతా ఓ అద్భుత సాధనా ప్రపంచమే. వైవాహిక జీవితం ఇల్లు చక్కదిద్దుకునే నైపుణ్యం, వంట-వార్పు, పిల్లల పెంపకం, కుటుంబ సభ్యులందరికీ అనుకూలమైన మనఃస్థితిని కలిగి ఉండటం, సభ్యత, సంస్కారాలు నేర్చే గురువులా భాసిల్లడం, పుట్టింటికీ మెట్టినింటికీ వారధిలా ఉండటం- ఇవన్నీ అనేక కోణాల్లో సాగే గొప్ప సాధనలే!

ఎవరైనా జీవితంలోని దశలను, అవి తెచ్చి పెట్టే ఫలితాలను ఆస్వాదించాలి. కుంగుబాటును సంతోషాతిశయాలను సమానంగా స్వీకరించగలగాలి. సాధనతో
ఒడుదొడుకులను వివేకంతో అధిగమించాలి. నూరేళ్ల జీవనఫలాన్ని, దాని మాధుర్యాన్ని ఆస్వాదించాలి?

దానం శివప్రసాదరావు


Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.