మీరు జీవించడంలో కీలకమైన విషయం ఏమంటే
మీ జీవితానికి ఒక లక్ష్యాన్ని కనుక్కోవడం.దాని పైనే మీ మనస్సు ను,బుద్ధిని లగ్నం చేసి ఆ లక్ష్యాన్ని చేరడమేనన్నాడు గౌతమ బుద్దుడు. మధ్యలో తన లక్ష్యాన్ని మరచి దారితప్పరాదన్నాడు. అలాగే ఒక లక్ష్యాన్ని చేరుకున్నాక మరొక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. జీవితమంటే లక్ష్యాల చేధనే. లక్ష్యాన్ని చేరుకోవడానికి తగినంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దీనికి సంబంధిత పుస్తకాలను చదవాలి.గురువుల సలహాలను పొందాలి. ఆ రంగంలో విజయం పొందినవారి జ్ఞానాన్ని గ్రహించాలి.
ఎంత చదివామన్నది ముఖ్యం కాదు.ఎంత పరిణతి సాధించామన్నదే ముఖ్యం.
ఎంత జ్ఞానం సంపాదించామన్నది ప్రధానం కాదు. ఎంత మేరకు తగిన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నా మనదే ప్రధానం. అందుకే సినారె అంటాడిలా.
"పరిణతమది ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే
పదునెక్కిన తపన లేక తుది లక్ష్యం అందేదెలా?"
____ pillaa kumaraswamy

Comments
Post a Comment